క్రిస్టీన్ తుఫాను బాధితుల కొరకు నిధుల సేకరణ విజ్ఞప్తిని ప్రారంభించిన ఫిలిప్పీన్స్‌

ఫిలిప్పీన్ లోని కారితాస్ సంస్థ వారి సహకారంతో క్రిస్టైన్ తుఫాను ప్రభావిత కుటుంబాలు మరియు సంఘాల మద్దతు ఇవ్వడానికినిధుల సమీకరణ ప్రారంభించింది.

గత వారం ఫిలిప్పీన్స్‌లో క్రిస్టీన్ టైఫూన్ సంభవించినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,70,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వీరికి మానవతా సహాయం అత్యవసరం.

పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ఫి గారు ఫిలిప్పీన్స్‌ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, 2024 అక్టోబరు 27న ప్రార్థన సమయంలో విశ్వాసులు,యాత్రికులతోపాటు వారికొరకు ప్రార్ధించారు.

కాలాపన్ వికారియేట్ అపోస్టోలిక్ వికార్ మహా పూజ్య మోయిసెస్ M. క్యూవాస్ గారు విచారణలతో, కతోలిక  పాఠశాలలు మరియు సంస్థలచే ప్రత్యేక సేకరణలు నిర్వహించబడతాయని ప్రకటించారు.

"ప్రతి విచారణ అధికార పరిధిలోని సంపన్న కుటుంబాలు, సంస్థలు, సంఘాలు, మరియు సంభావ్య దాతలకు వారి ఆర్థిక సహాయాన్ని నేరుగా కోరుతూ వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయవలసిందిగా మేము కోరుతున్నాము."

"ఈ వరద వల్ల రోడ్లు నగరానికి దారితీసే నివాసితుల కదలికకు మరియు మానవతా సహాయం అందించడానికి ఆటంకం కలిగిస్తున్నాయి" అని కారితాస్ కాసెరెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ మార్క్ రియల్ అన్నారు.

ఉష్ణమండల తుఫాను తూర్పు ఫిలిప్పీన్స్‌ను తాకింది, ఇది బికోల్ ప్రాంతంలోని ప్రావిన్సులపై ప్రభావం చూపింది, వీటిలో వికారియేట్ ఆఫ్ కాలాపన్,కాసెరెస్ మేత్రాసనం మరియు కామరైన్స్ సుర్ ఉన్నాయి.

నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, 1 ,90,000 కుటుంబాలు - వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో సహా మొత్తం 970,000 కంటే ఎక్కువ మంది ప్రజలు - స్థానభ్రంశం చెందారు, ఇప్పుడు చాలా మంది తరలింపు కేంద్రాలు మరియు తాత్కాలిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు.