కుటుంబాలు మరియు పిల్లలపై ఇజ్రాయెల్ దాడుల విరమణకు పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్
అక్టోబరు 30, 2024న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ "గాజా మరియు లెబనాన్‌లలో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులు అమాయక జీవితాలపై, ముఖ్యంగా పిల్లలు మరియు కుటుంబాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయి అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
“యుద్ధంలో ఎవరూ గెలవరు; ప్రతి ఒక్కరూ నష్టపోతారు, అంటూ ”గాజాలోని నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన వైమానిక దాడిలో మరణించిన 150 మందికి పైగా ప్రజల జీవితాలను గుర్తు చేసుకున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ ఉద్రేకంతో, "యుద్ధం ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఓటమి" అని ప్రకటించారు, అతను మరోసారి శాంతి మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలకు ముగింపు పలకాలని సాధారణ ప్రేక్షకుల సమావేశ ముగింపులో పిలుపునిచ్చారు
యుద్ధం ఎల్లప్పుడూ విషాదకరమైన నష్టమని,"యుధంలో అమరవీరులైన ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, మయన్మార్, నార్త్ కివు మరియు అనేక దేశాలతో సహా" హింసతో ప్రభావితమైన అనేక దేశాలను అయన గుర్తుచేసారు.
"శాంతి అనేది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన బహుమతి," అతను శ్రోతలకు గుర్తు చేసారు .
ఇటీవల జరిగిన ఒక సంఘటనను గురించి గుర్తుచేస్తూ , “పిల్లలు మరియు కుటుంబాలకు యుద్ధంతో సంబంధం ఏమిటి?” అని అంటూ,వారే "మొదటి బాధితులు" అవుతున్నారు అని ఉద్బోధించారు.
ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 24 మరియు 29 మధ్య గాజాలో ఏడు "సామూహిక ప్రాణనష్ట సంఘటనలను" నమోదు చేసింది.
దక్షిణ గాజాలోని మనారా ప్రాంతంలో నివాస భవనాలపై ఇటీవల జరిగిన ఒక దాడిలో మరణించిన వారు 33 మంది వారిలో 14 మంది పిల్లలు ఉన్నారు, వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
ఇతర దాడులలో, వైమానిక దాడులు వలన స్థానభ్రంశం చెందిన వ్యక్తుల నివాసలు లక్ష్యంగా చేసుకున్నాయి, ఫలితంగా 93 మంది మరణించారు.
ఈ సంక్షోభానికి అదనంగా, గాజాలో మిగిలిన కొన్ని హాస్పిటల్స్‌లో ఒకదానిపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి, అందులో 150 మందికి పైగా చిక్కుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
పాలస్తీనియన్ సివిల్ డిఫెన్స్ ప్రకారం, "గత 19 రోజుల్లోనే 770 మంది మరణించారు."
అమాయకుల ప్రాణాల రక్షణ మరియు శాంతి పునరుద్ధరణ కొరకు హింసకు స్వస్తి పలకాలన్న
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు