కాపరి లేని మందవల్లే మిగిలామన్న కార్డినల్ బల్దస్సారే రీనా

దివంగత పోప్ ఫ్రాన్సిస్ మృతికి తొమ్మిది రోజుల సంతాప దినమైన నోవెండియల్స్ మూడవ రోజు దివ్యబలిపూజ ఏప్రిల్ 28 సోమవారం మధ్యాహ్నం సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగింది.
దీనికి Cardinal Baldassare Reina. అధ్యక్షత వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరితో పాటు, తమ పీఠాధిపతి పొప్మ ఫ్రాన్సిస్ మరణానికి దుఃఖించడమే కాకుండా, "కాపరి లేని మందవల్లే మిగిలాము అని రోమ్ మేత్రాసన కార్డినల్ వికార్ జనరల్ తమ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
క్రీస్తు ప్రభువా మనకొరకు ఎలా చివరివరకు కష్టాలను అనుభవించారో, తన మంద కోసం ప్రాణ త్యాగం చేసారో,పొప్ ఫ్రాన్సిస్ చివరి ప్రజల సందర్శన కూడా ఆ దేవుని ప్రేషిత కార్యం సంపూర్తిగా నెరవేర్చడానికే అని కార్డినల్ రీనా అన్నారు
శ్రీసభ దివంగత పొప్ నిర్దేశించిన మార్గంలో కొనసాగించాలని , ఆ మరియతల్లి మాడీవర్తిత్వాని కొర్రుతూ, మరణం ముగింపు కాదు, పునరుత్థానానికి బీజం అని విశ్వాసులకు గుర్తు చేస్తూ కార్డినల్ రీనా ముగించారు.