వెర్డే ఐలాండ్ మార్గాన్ని రక్షించాలని విజ్ఞప్తి
వెర్డే ఐలాండ్ మార్గాన్ని రక్షించాలని విజ్ఞప్తి
ఏప్రిల్ 22న ఎర్త్ డే (ప్రపంచ ధరిత్రీ దినోత్సవం) సందర్భంగా న్యాయవాదులు, మత్స్యకారులు, శ్రీసభ సంఘాలు బటాంగాస్‌లోని ప్రపంచంలోని ఎత్తైన మదర్ మేరీ స్వరూపం వద్ద వెర్డే ఐలాండ్స సముద్ర మార్గని రక్షించాలని ప్రదర్శనలు చేసారు. వెర్డే ఐలాండ్ పాసేజ్ Verde Island Passage(VIP) రక్షణ కోసం ఈ కార్యక్రమాని నిర్వహించారు.
ఫాదర్ ఎడ్విన్ గారిగ్జ్ గారు మాట్లాడుతూ మన ఏకైక ఇంటికి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను మేము ఈ సందర్భముగా గుర్తు చేస్తున్నాము అని, మన మహాసముద్రాల రక్షణ చాలా ముఖ్యమైనది అని అన్నారు.
మరియు వెర్డే ఐలాండ్ పాసేజ్ (VIP )ని రక్షించడం, దాని కమ్యూనిటీల కొరకు మాత్రమే కాదు; ఇది భూమి కోసం ప్రపంచ పోరాటం కూడా అని అన్నారు. VIPకి చట్టపరమైన రక్షణ కల్పించడంలో అత్యవసరంగా వ్యవహరించాలని ఫాదర్ ఎడ్విన్ గారిగ్జ్ గారు ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పర్యావరణ శాఖను కోరారు.
ఈ ప్రాంతంలో చమురు , శిలాజ వాయువుల విస్తరణ మరియు కాలుష్యం నుండి అపారమైన ప్రమాదంలో ఉంది. సముద్ర జీవులు, మరియు వాటి ఉనికి ప్రమాదంలో ఉంది. విస్తరించిన నేషనల్ ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్టెడ్ ఏరియా సిస్టమ్స్ యాక్ట్ కింద వీఐపీని రక్షిత ప్రాంతంగా ప్రకటించండి’’ అని గరిగ్జ్ అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer