క్రీస్తు పునరుత్థాన విశిష్టతపై ప్రసంగించిన పోప్

బుధవారం అక్టోబర్ 22 సెయింట్ పీటర్స్ స్క్వేర్లో సామాన్య ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో క్రీస్తు పునరుత్థానంపై ప్రసంగించారు
యేసు పునరుత్థానం, నేటి ప్రపంచంలోని సవాళ్లలో ఒకటైన దుఃఖానికి ఔషధం అని పోప్ వివరించారు
ప్రస్తుత ప్రపంచంలో దుఃఖం ఓ వ్యాధిలా మారింది,తద్వారా అది మన జీవితాలలో సంతోషం కోల్పోయేలా చేస్తుంద. ఈ దుఃఖానికి ఔషధం క్రీస్తు పునరుత్థానం అని పోప్ అన్నారు
లూకా సువార్తలో చెప్పబడిన ఎమ్మావు సంఘటనను ఆయన ఉదాహరిస్తూ,ఆ ఇద్దరు శిష్యులు దుఃఖంతో,నిరుత్సాహంతో నిండిపోయి ఉన్నారు.
కానీ క్రీస్తు వారికి ప్రత్యక్షమై,“అప్పం విరిచినపుడు” వారి ఆత్మీయ నేత్రాలు తెరచుకున్నాయని, క్రీస్తు పునరుత్థానం మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుందని,పునరుత్థానం మన మనసును, ప్రపంచాన్ని, భవిష్యత్తును కొత్త కాంతిలో చూడగల విశ్వాసాన్ని అందిస్తుందని పోప్ తన ప్రసంగాన్ని ముగించారు.