ఘనంగా జాతీయ యువత ఆదివారం

ఘనంగా జాతీయ యువత ఆదివారం

జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

యువత విభాగం నుండి మనీషా, జ్యోష్నలు గురువులను, తోటి యువతీ యువకులను, విచారణ ప్రజలను స్వాగతం పలుకుతూ ప్రత్యేక రీతిలో దేవాలయం లోనికి ఆహ్వానించారు. విచారణ యువతీ, యువకులుకు ప్రత్యేక దివ్యపూజ బలిని గురుశ్రీ సంతోష్ CMF గారు, గురుశ్రీ జాన్ CMF గారు , గురుశ్రీ జైపాల్ తుమ్మ CMF గారు జరిపించారు. విచారణ యువత పాటలు , బైబిల్ పఠనం, విశ్వాసుల ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న గురుశ్రీ జైపాల్ తుమ్మ CMF గారు యువతీ యువకుల కొరకు ప్రత్యేకించి ప్రార్థనలు జరిపారు.

దేవాలయంలో జాతీయ యువత ఆదివారం కార్యక్రమాలు జరుగుతుండగా ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ దేవాలయములోనికి అడుగు పెట్టారు. ఒక్కసారిగా యువతి, యువకులలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.

మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో కొంతసేపు ముచ్చటించారు. "యువత శ్రీసభకు మంచి సైనికులగా ఉండాలని, ప్రభుయేసుని మార్గంలో నడవాలని, మంచి ప్రార్థన జీవితం జీవించాలి" మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు అని సూచించారు. అనంతరం యువతీ యువకుల కోసం ప్రత్యేక ఆరాధనను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారు, విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు , గురుశ్రీ రవితేజలు పాల్గొన్నారు.

విచారణ గురువు గురుశ్రీ సంతోష్ CMF గారు ప్రేమతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారిని విచారణ ప్రజలు , యువతీయువకుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విచారణ యువతకు మార్గచూపరి గా నిలిచినా సీనియర్ నాయకుడు ఆనంద్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారికి మరియు విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF , గురుశ్రీ జాన్ CMF, యువత డైరెక్టర్ గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారికి, గురుశ్రీ రవితేజ గారికి యూత్ అందరి తరుపున ప్రశాంతి మరియు నిర్మల కృతజ్ఞతలు తెలిపారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer