2025 జూబిలీ సంవత్సరాన్ని మరియతల్లికి అప్పగించమని ఆహ్వానించిన పొప్ ఫ్రాన్సిస్
జనవరి 1 న "మరియతల్లి దివ్య మాతృత్వ పండుగ సందర్భంగా" వాటికన్ వేదికగా తాను అందించిన పండుగ సందేశంలో "ఏసుక్రీస్తు మనలో జన్మించాలని ఆశపడుతున్నారని"
పోప్ ఫ్రాన్సిస్ అన్నారు
క్రీస్తు ప్రభువు మరియతల్లి ద్వారా మన రక్షణ నిమిత్తం మానవునిగా జన్మించారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పొప్ ఫ్రాన్సిస్ కోరారు.
ఈ నూతన 2025 జూబిలీ సంవత్సరం ఆ మరియతల్లి చేతికి అప్పగిస్తూ, ప్రపంచ శాంతికై ప్రార్థిద్దాం.
ఆ మరియతల్లి మన మనసులను,మన ఆలోచనలను,మన తలంపులను క్రీస్తు ప్రభువు వైపు తిప్పడానికి అనుక్షణం పరితపిస్తుంటారని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.