మహా పూజ్య పొలిమేర జయరావు గారితో సమావేశమైన AICU
అపోస్తలిక్ పాలనాధికారి మహా పూజ్య పొలిమేర జయరావు పీఠాధిపతులను అభినందించిన విశాఖ అతిమేత్రాసన ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ సభ్యులు
విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమేర జయరావు గారిని ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్(AICU), విశాఖ అతిమేత్రాసన కార్యవర్గ సభ్యులు తేది11-03-2024 న అతిమేత్రాణుల గృహమునందు మర్యాద పూర్వకముగ కలిసారు.
అపోస్తలిక్ పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శుభసందర్భమున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగ పీఠాధిపతులు మాట్లాడుతు AICU ఇటీవల కాలంలో నిర్వహించిన 'క్రైస్తవ హక్కుల పోరాట దీక్ష' ను గూర్చి అభినందించారు. AICU గతంలో చేపట్టిన పలు పోరాటాలు,నిరసన దీక్షలు,ర్యాలీలు గూర్చి అడిగి తెలుసుకుని, గృహస్థ క్రైస్తవులుగా మరింత బాధ్యతతో మెలగుచు విశ్వాస వ్యాప్తికి, పటిష్టతకు, మైనారిటీల హక్కుల సాధన, పరిరక్షణకు విచారణలలోని విచారణ గురువులు మరియు విశ్వాసులతో మమేకమై కృషిచేయాలని, తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమస్ఫూర్తితో చైతన్యవంతంగ ఉండాలని ఉద్బోధించారు.
ఈ కార్యక్రమములో AICU అధ్యక్షులు శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు, కార్యదర్శి బి.కె.జోసఫ్, జాతీయ కార్యదర్శి శ్రీ జి.స్వామినాధం, TCC ఉపాధ్యక్షులు శ్రీ పి.రవి ఆల్బర్ట్ సహా స్థానిక AICU కార్యవర్గ సభ్యులు అందరు పాల్గొన్నారు.
-బి.వి.రవీంద్ర శేషుబాబు అధ్యక్షులు (AICU-VIZAG)
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer