మనమంతా దేవునికి రుణపడి ఉన్నామన్న పోప్ ఫ్రాన్సిస్

“మనమంతా దేవునికి రుణపడి ఉన్నామన్న పోప్ ఫ్రాన్సిస్ 

జనవరి 1న 58వ ప్రపంచ శాంతి దినోత్సవం రాబోయే 2025జూబ్లీ నిరీక్షణా సంవత్సర ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య శ్రీసభ నిరిక్షణా సంవత్సరాన్ని 2025జూబ్లీని  ప్రారంభించనుంది .

"మా అపరాధములను క్షమించి,మాకు మీ శాంతిని ప్రసాదించు " అని జూబిలీ నేపథ్యంపై  లోతైన అర్థాన్ని తెలిపారు.

మనమందరం దేవునికి "ఋణపడి ఉన్నామని గుర్తుచేస్తూ, ఆయన తన అనంతమైన దయ మరియు ప్రేమతో మన పాపాలను క్షమించి, ఇతరులను క్షమించమని పిలుపునిచ్చారు.

“భవిష్యతులో స్వార్థం, శత్రుత్వం, ఆందోళన, వాటి స్థానంలో ఔదార్యం, క్షమాపణ,శాంతి తో నిండిన ప్రపంచం కొరకు ప్రార్ధన చేదాం.