న్యాయమైన సమాజాన్ని నిర్మించడంలో పునీత లూసీ కృషిని గుర్తుచేసిన పొప్ ఫ్రాన్సిస్
మహిళల సేవలు, వారి భాగస్వామ్యం శ్రీసభ అభివృద్ధికి ఎంతగానో అవసరమని డిసెంబర్ 13న పునీత లూసీ గారి సమరణ రోజున పొప్ ఫ్రాన్సిస్ అన్నారు.
మహిళల సేవలు, వారి భాగస్వామ్యం శ్రీసభ అభివృద్ధికి ఎంతగానో అవసరమని ఆయన అన్నారు.
సిసిలీలోని సిరక్యూస్ అగ్రపీఠ వారు ఈ సంవత్సరాన్ని పునీత లూసీ గారికి అంకితం చేస్తూ ప్రకటన చేశారు.
పునీత లూసీ కడవరకు తన విశ్వాసాన్ని కోల్పోలేదని, చివరికి తన ప్రాణాలనే దేవునికి సమర్పించిందని, ప్రతి మహిళా ఆ పునీతురాలిని పోలి జీవించాలని ఆయన కోరారు.
సువార్తను తిరగేస్తే ఎందరో స్త్రీలు క్రీస్తు ప్రేమకు సాక్షులుగా నిలిచారని, వారి ద్వారానే క్రీస్తు పునరుత్థానం మనకు చేరిందని ఆయన అన్నారు.
మహిళలు ధైర్యంగా ఉండాలని, పవిత్రతతో జీవిస్తూ, శ్రీసభ అభివృద్ధికై పాటుపడాలని ఆయన కోరారు.