నేపుల్స్ అగ్రపీఠాధిపతిని కార్డినల్ కాన్సిస్టరీకి జోడించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
భవిష్యత్ కార్డినల్స్ జాబితాకు నేపుల్స్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య డొమెనికో బటాగ్లియా గారిని జోడించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్.
"డిసెంబర్ 7న కాన్‌సిస్టరీ సందర్భంగా సృష్టించబడే నూతన కార్డినల్స్ పేర్లలో తాను
నేపుల్స్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య డొమెనికో బటాగ్లియా గారిని చేర్చినట్లు పాపు ఫ్రాన్సిస్ నియమిస్తూ నవంబర్ 4 న "అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూనీ తెలియచేసారు
"శ్రీసభకు మరియు దేవుని ప్రజలకు సేవ చేయాలని, అతని అర్చక జీవితాన్ని మరింత ప్రభునకు అంకితం చేయాలనుకుని" ఇండోనేషియాలోని బోగోర్ పీఠాధిపతులు పాస్కాలిస్ బ్రూనో స్యుకుర్ కార్డినల్‌గా ఉండకూడదని చేసిన అభ్యర్థనతో నూతన కార్డినల్‌ల సంఖ్య ఒకటి తగ్గింది
మహా పూజ్య డొమెనికో బటాగ్లియా గారు 'డాన్ మిమ్మో' గా పిలుస్తారు.
దక్షిణ ఇటలీలో ప్రముఖ మతసంబంధమైన పాత్రను పోషిస్తూ, ముఖ్యంగా యువతకు మరియు మాదకద్రవ్య వ్యసనంతో పోరాడుతున్న వారికి సీవ చేస్తున్నారు.
సినడ్ ఆన్ సినడాలిటీపై రెండు సమావేశాలలో పాపు గారి పిలుపుమేరకు ఆయన పాల్గొన్నారు
దక్షిణ ఇటాలియన్ ప్రాంతం కాలాబ్రియాలో జన్మించారు, వాస్తవానికి కాటాన్జారియోలోని సాట్రియానోకు చెందిన ఆయన వయస్సు 61 సంవత్సరాలు.
నేపుల్స్ అగ్రపీఠాధిపతిగా నియమించబడక ముందు, ఆయన బెనెవెంటో ప్రావిన్స్‌లోని సెరెటో సన్నిటా-టెలీస్-శాంట్'అగాటా డి' గోటి మేత్రాసనానికి పీఠాధిపతిగా పని చేసారు .
కాటన్జారోలోని పాంటిఫికల్ రీజినల్ సెమినరీ "శాన్ పియో X"లో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రంలో తన అధ్యయనాలను పూర్తి చేసారు
6 ఫిబ్రవరి 1988న గురువుగా అభిషేకింపబడిన తరువాత ఆయన విచారణ కర్తలుగా, రెక్టర్ గా , మేత్రాసన కార్యాలయాల డైరెక్టర్గా ఎనో సంవత్సరాలు తన విస్తృత సేవను అందించారు
24 జూన్ 2016న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిచే సెరెటో సన్నితా -టెలీస్- సంత్'అగాటా డి' గోటి యొక్క ఎపిస్కోపల్ సీగా నియమింపబడారు .
2 అక్టోబరు 2016న బెనెవెంటో కమ్యూనిటీ అధికారంలో పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు
బటాగ్లియా గారు పేదలు మరియు సమాజంలో అట్టడుగున ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు
1992 నుండి 2016 వరకు మాదకద్రవ్య వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులతో పాటుగా,
2006 నుండి 2015 వరకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాన్ మారియో పిచ్చి యొక్క థెరప్యూటిక్ కమ్యూనిటీస్ (FICT)కి అనుసంధానించబడిన 'సెంట్రో కాలాబ్రేస్ డి సాలిడారిటా'కు మార్గనిర్దేశం చేసారు
2000 నుండి 2006 వరకు, అతను కాటాన్జారోలోని బెటానియా ఫౌండేషన్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసారు,