జూబిలీ మన జీవితాలను పరిశీలించే విలువైన అవకాశం అన్న పోప్ ఫ్రాన్సిస్
సిస్టర్స్ అఫ్ ది హోలీ ఫామిలీ అఫ్ నజరేత్ మఠకన్యలతో 2025 జూబ్లీ నిరీక్షణా సంవత్సరాన్ని క్రీస్తు ప్రభువుకు మన హృదయాలను తెరవడానికి ఒక ప్రత్యేక అవకాశంగా జీవించాలని పోప్ ఫ్రాన్సిస్ గారు ఆహ్వానించారు.
2025 జూబ్లీ “వ్యక్తులుగా, సముదాయంగా మన జీవితాలను పరిశీలించడానికి విలువైన అవకాశాన్ని కలిపిస్తుంది
డిసెంబర్ 4 న సిస్టర్స్ అఫ్ ది హోలీ ఫామిలీ అఫ్ నజరేత్ ఫౌండేషన్ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా వారి సభ్యులను పోప్ ఫ్రాన్సిస్ కలిశారు
"ప్రజలకు సేవించడం కోసం ఆధ్యాత్మికంగా నూతనోత్తేజాన్ని పొందడానికి సంఘ జీవితంలో ఈ మైలురాయి దోహదపడాలని ఆయన ప్రార్థించారు.
సిస్టర్స్ అఫ్ ది హోలీ ఫామిలీ అఫ్ నజరేత్ 1875లో స్థాపించబడి, 14 దేశాలలో 140 కమ్యూనిటీలలో సేవ చేశారు.
పునరాలోచనం, ఆత్మావలోకనము మరియు పవిత్రాత్మ చెప్పేది వినటానికి ఈ ఆగమన కలం అవకాశాని కలిపిస్తుంది అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
యుద్ధం ద్వారా నాశనం చేయబడిన అనేక సమకాలీన కుటుంబాలను, తమ ఇళ్లను లేదా స్వదేశాల నుండి బలవంతంగా పారిపోయి వచ్చినవారిని పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేసుకున్నారు.
సిస్టర్స్ అఫ్ ది హోలీ ఫామిలీ అఫ్ నజరేత్ సభ్యులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, కనికరంతో కూడిన పనులు చేయాలని ఆయన కోరారు.