ఘనంగా జరిగిన డివైన్ హీలింగ్ కన్వెన్షన్ ప్రార్థన కూటములు

ఘనంగా జరిగిన డివైన్ హీలింగ్ కన్వెన్షన్ ప్రార్థన కూటములు 

సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్స్  లో "డివైన్ హీలింగ్ కన్వెన్షన్"  స్వస్థత ప్రార్థన కూటములు మూడు రోజులపాటు భక్తియుతంగా జరిగాయి. దివ్యవాక్కు కేంద్రం డైరెక్టర్, ఆధ్యాత్మిక గురువులు ఫాదర్ సీరిల్ SVD, గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థన కూటములు భక్తియుతంగా జరిగాయి.  

మూడురోజుల పాటూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు  ఈ స్వస్థత ప్రార్థనలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ఫాదర్ సీరిల్ SVD, గారితో పాటూ, పోటా - డివైన్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ అంతోనీ పారంకైమాళిల్ గారు కూడా పాల్గొని అద్భుతమైన దైవసందేశాని ప్రజలకు అందించారు. 

అనారోగ్యంతో పాల్గొన్న ప్రజల కొరకు ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆరాధనలు నిర్వహించారు.  ఫాదర్ సీరిల్ గారు ప్రజలందరికొరకు ప్రార్ధించారు. అయన మాట్లాడుతూ "మనలను స్వస్థపరచు ప్రియ ప్రభువునకు అసాధ్యమైనదేదియు లేదు. డాక్టర్స్  స్వస్థపరచలేని వ్యాధులను కూడా ఆయన స్వస్థపరచుటకు సమర్థుడుగా ఉన్నాడు" అని అన్నారు. కన్నీటి ప్రార్థనలలో పాల్గొన్న విశ్వాసులలో చాలామంది దేవుడు ముట్టి మమ్మలని స్వస్థపరిచాడు అని  సాక్ష్యం ఇచ్చారు.  

రెండవరోజు జరిగీన దివ్యబలి పూజలో మహా పూజ్య కార్డినల్ పూల అంతోనీ గారు పాల్గొని ఇతర  గురువులతో కలసి దివ్యబలి పూజను సమర్పించారు.  

ఈ ప్రార్థన కూటములలో సిస్టర్ లూసీ రెడ్డి గారు, డివైన్ లైట్ మినిస్ట్రీస్ సభ్యులు , క్యాథలిక్ కారిస్మాటిక్ రెన్యువల్ సభ్యులు పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు.  
  

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer