గేలిక్ ఫుట్‌బాల్ అథ్లెట్లు పోప్ లియోకు జూబ్లీ జెర్సీని బహుమతిగా ఇచ్చారు

గేలిక్ ఫుట్‌బాల్ అథ్లెట్లు పోప్ లియోకు జూబ్లీ జెర్సీని బహుమతిగా ఇచ్చారు
జూన్ 14న సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన పాపల్ సాధారణ ప్రేక్షకుల సమావేశం సందర్భంగా రోమ్ హైబర్నియా గేలిక్ అథ్లెటిక్ అసోసియేషన్ (GAA)కి చెందిన ముగ్గురు సభ్యులు నియామ్ ర్యాన్, కేథరీన్ హల్లినన్ మరియు కేటీ మొల్లాయ్ లు పోప్ లియో XIV గారికి ప్రత్యేకంగా రూపొందించిన జూబ్లీ జెర్సీని బహూకరించారు.
రెండు రోజుల జూబ్లీ ఆఫ్ స్పోర్ట్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ జూబ్లీ వారాంతాన్ని క్రీడలకు అంకితం చేయడం ఈ ముగ్గురు మహిళలకు ప్రత్యేకమైనది.
పోప్ లియోతో తాము ఒక ప్రత్యేక క్షణాన్ని ఎలా పంచుకోగలిగామో కేటీ గుర్తుచేసుకున్నారు.
"మేము మా జూబ్లీ ఆఫ్ స్పోర్ట్ ఎడిషన్ రోమ్ హిబెర్నియా జెర్సీని పోప్‌కి ఇవ్వగలిగాము. గేలిక్ భాషలో వ్రాసిన జూబ్లీ లోగోను స్లీవ్‌పై ముద్రించాము," అని ఆమె చెప్పింది.
పన్నెండు సంవత్సరాల క్రితం, ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి గేలిక్ అథ్లెటిక్ అసోసియేషన్ (GAA) ను స్థాపించారు . వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి వచ్చి ఈ క్రీడను ఆడగలిగేల ఇది స్థాపించబడింది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌కు చెందిన నియామ్ ర్యాన్ మరియు కేథరీన్ హల్లినన్ మరియు న్యూయార్క్‌కు చెందిన కేటీ మోల్లోయ్ రెండు సంవత్సరాల క్రితం GAAలో చేరారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer