క్రీస్తు ప్రేమను అన్వేషిస్తున్న యువత: పోప్ లియో XIV

క్రీస్తు ప్రేమను అన్వేషిస్తున్న యువత: పోప్ లియో XIV

క్రీస్తు ప్రేమను అన్వేషిస్తున్న యువత: పోప్ లియో XIV

వాటికన్ సిటీ, అక్టోబర్ 24, 2026: కేరళలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కతోలిక  యువజన ఉద్యమమైన జీసస్ యూత్ (Jesus Youth) ప్రతినిధులతో పరిశుద్ధ లియో పాపు గారు శనివారం నాడు  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువత క్రీస్తు ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించేలా చేయడం, వారిని శ్రీసభ  జీవితంలో చురుకుగా భాగస్వాములను చేయడం, విశ్వాసంతో కూడిన సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. 

ఈ సందర్భముగా "యువత తమ జీవితాలు గొప్పవి, అందమైనవి అని తెలుసుకోవాలి, ఎందుకంటే వారు దేవుని గొప్ప ప్రణాళికలో భాగం," అని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు.యువత కేవలం మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవాలని ఆయన సందేశం సూచించింది. క్రీస్తు ప్రేమను అనుభవించిన యువత తమ జీవితాల్లో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వగలరని ఆయన వివరించారు.

తన ప్రసంగంలో పరిశుద్ధ లియో పాపు గారు అజ్నా జార్జ్ అనే జీసస్ యూత్ సభ్యురాలి ఉదాహరణను ప్రస్తావించారు.అనారోగ్యం, జీవితంలోని కష్టాలు ఎదురైనప్పటికీ, యూకారిస్టులో సన్నిహితంగా అనుభవించే యేసుపై ప్రేమ ఆమెకు ఆధ్యాత్మిక బలాన్ని అందించిందని ఆయన గుర్తుచేశారు.

ఈ సమావేశం జీసస్ యూత్ (JY)ఉద్యమం ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో భాగంగా జరిగింది. యువత విశ్వాస జీవితాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సువార్త సందేశాన్ని చాటిచెప్పేందుకు ఈ సదస్సు దోహదపడనుంది. 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image