కర్నూలు మేత్రాసనం లో భద్రమైన అభ్యంగనం మరియు దివ్యసత్ప్రసాదం స్వీకరించిన విశ్వాసులు

కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ,బాల యేసు దేవాలయములో జూన్ 1,2024 న సాయంత్రం 5:30  గంటలకు భద్రమైన అభ్యంగనం మరియు నూతన దివ్యసత్ప్రసాద స్వీకరణ ఘనంగా జరిగింది 

కర్నూల్ పీఠానికి నూతనంగా 5వ పీఠాధిపతులుగా అభిషేకింపబడి శ్రీ శ్రీ శ్రీ గోరంట్ల జ్వానేస్ గారు మొట్టమొదటిసారి విచారణకు విచ్చేయగా,ఆదోని డీన్, విచారణ కర్తలు గురుశ్రీ కోలా విజయరాజు గారి ఆధ్వర్యంలో ఆ విచారణ విశ్వాసులు ఘనంగా స్వాగతం పలికారు 

పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ ప్రాంతం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఎమ్మిగనూరు సర్కిల్ మీదుగా బాల యేసు దేవాలయానికి చేరుకున్నారు అనంతరం చిన్నారులు పీఠాధిపతులు మహా పూజ్య గోరంట్ల జ్వానేస్ గారిని సాంస్కృతి కార్యక్రమాల ద్వారా స్వాగతం పలికారు.

అనంతరం పీఠాధిపతుల వారు మరియు 11 మంది గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.  

సుమారు 68  మంది  భద్రమైన అభ్యంగనం మరియు నూతన దివ్యసత్ప్రసాదం స్వీకరించారు.

దివ్యపూజాబలి అనంతరం శ్రీ మారం రెడ్డి జోజీ రెడ్డి గారు మరియు ఈ. పీ నిర్మల గారు  మరియు కుటుంబం వారు ప్రేమ విందు ఏర్పాటు చేశారు.

Tags