కర్నూలు మేత్రాసనం,ఆదోనిలో డీనరి స్థాయి యువతా సదస్సు
2024 డిసెంబర్ 28న, కర్నూలు మేత్రాసనం,ఆదోని, పరిశుద్ధ బాలయేసు దేవాలయము నందు డీనరి స్థాయి యువతా సదస్సు ఘనంగా జరిగింది
యువతీ యువకులను ఉద్దేశించి కర్నూలు పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్, OCD గారు మాట్లాడుతూ ప్రతి యువతీ యువకుడు చెడువసనాలను వదిలి సన్మార్గంలో నడవాలంటే భక్తి మార్గం ఎంతో అవసరమని వాటి ద్వారానే మనిషి శాంతి సమాధానముతో జీవిస్తారని,అలాగే ప్రతి యువతీ యువకులు చదువుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే చదివే మార్గమని ఆ చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడే మంచి ఉద్యోగాల్లో రాణిస్తారని పేదరికం నుంచి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని కావున చదువు పట్ల ప్రతి విద్యార్థి శ్రద్ధకలిగి ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ప్రతి యువతీ యువకులు నైపుణ్యతలో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందడానికి తన వంతు అవకాశం కలిగిస్తానని కావున అటువంటి అవకాశాల పట్ల ప్రతి యువతీ యువకుడు శిక్షణ చేసి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి సుమారుగా 500 మంది యువతీ యువకులు, గురువులు ఆదోని డీన్ గురుశ్రీ కోలా విజయ రాజు, యువత డైరెక్టర్ గురుశ్రీ రాజేంద్ర, గురుశ్రీ జాన్ డేవిడ్, గురుశ్రీ చిన్నప్ప, గురుశ్రీ జోసఫ్, గురుశ్రీ సురేష్, మఠ కన్యలు, ఉపాధ్యాయులు ప్రభుదాస్, నవీన్ బాలరాజ్ చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.