వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించడానికి ప్రపంచ ఐక్యతను కోరిన పోప్ ఫ్రాన్సిస్

క్యూబా, బొలీవియా మరియు వెనిజులా రాయబార కార్యాలయాల వారు నవంబర్ 28న రోమ్‌లో నిర్వహించిన సదస్సు లో "పేదలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించడానికి ప్రపంచ ఐక్యతను కోరుతూ పోప్ ఫ్రాన్సిస్ ఆయన సందేశం అందించారు.

UN పర్యావరణ కార్యక్రమం ప్రకారం విపరీతమైన వేడి తరంగాలు ఏటా ప్రపంచ జనాభాలో 30 శాతం మందిని ప్రభావితం చేస్తున్నందున తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియపరిచారు 

తన లేఖలో, పోప్ ఫ్రాన్సిస్ వాతావరణ మార్పు సంకేతాలు "కాదనలేనివి" అని హెచ్చరిస్తూ ప్రకృతితో పరస్పర సంబంధాన్ని పెంచుకోవాలని అందరిని  కోరారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న క్షీణిస్తున్న పర్యావరణ సంక్షోభంపై మాట్లాడుతూ,లాటిన్ అమెరికా పొంటిఫికల్ కమిషన్ అధ్యక్షుడు మరియు పీఠాధిపతుల డికాస్టరీ ప్రిఫెక్ట్ 
కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్, గారు మాట్లాడుతూ పరియవారేనని పరిరక్షించుకోవడం మాటలలో కాకుండా కార్య చరణంలో పెట్టాలి అని అన్నారు.

సౌర ఫలకాలును అమర్చడం మరియు ఎలక్ట్రిక్ వాహనాలను వాడడం వంటి వాటికన్ స్వంత దశలను బాధ్యతాయుతమైన నిర్వహణకు ఉదాహరణగా పేర్కొన్నాడు.

పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన కార్డినల్ పీటర్ అప్పియా టర్క్సన్ వాతావరణ మార్పును "నిర్మాణాత్మక పాపం" అని పేర్కొన్నారు మరియు చర్య తీసుకోవాల్సిన నైతిక బాధ్యతను గుర్తుచేశారు 

ప్రపంచం ఒక దైవిక సృష్టి , అది ఒక ప్రమాదం కాదని,మానవ జాతి దాని పాత్రను సహ సృష్టికర్తలుగా పోషించాలని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గుర్తు చేశారు

ఆకలితో అలమటిస్తున్న దేశాల అసమాన బాధను లాటిన్ అమెరికా ప్రతినిధులు నొక్కి చెప్పారు.

లాటిన్ అమెరికా పొంటిఫికల్ కమిషన్ కార్యదర్శి ఎమిల్స్ కుడా మాట్లాడుతూ " సంపన్న దేశాలతో పోలిస్తే బ్రెజిల్ లో వినాశకరమైన వరదలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు  . 

ప్రపంచ సంఘీభావం, స్థిరమైన అభివృద్ధి మరియు పోప్ ఫ్రాన్సిస్ ఎన్‌సైక్లికల్ లౌదాతో సి' అమలు కొరకు భవిష్యత్ తరాల కోసం గ్రహాన్ని రక్షించే సమిష్టి బాధ్యతను కోరుతూ  ఈ సదస్సు ముగిసింది.