ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  మొక్కలు నాటారు

విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళాంగణిమాత  దేవాలయ ప్రాంగణంలో   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  మొక్కలను నాటారు.   

విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

నూతన విద్య సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన  సందర్భముగా పిల్లలు మరియు యువత భవిషత్ కొరకు జూన్ 16న ప్రత్యేక ప్రార్థనలు వేళాంగణిమాత  దేవాలయంలో నిర్వహించారు.

ఆదివారం నాడు జరిగిన దివ్యపూజబలిని గురుశ్రీ సంతోష్ CMF  మరియు  గురుశ్రీ జాన్ వట్టికనాల్ CMF లు సమర్పించారు. చిన్నారుల కొరకు ప్రత్యేక ఆరాధనను గురుశ్రీ సంతోష్ CMF గారు నిర్వహించారు.  విచారణ యువ గాయక బృదం మధురమైన గీతాలను ఆలపించారు.

అనంతరం విచారణ  యువత ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. గురుశ్రీ సంతోష్ CMF  గారు మాట్లాడుతూ  "మానవ జాతికి మొక్కలే ఆధారమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు."

విచారణ పెద్దలు శ్రీ జ్వాకీమ్ గారు మాట్లాడుతూ "మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.  సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. అందుకే అందరూ కలసి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో  శ్రీ ఆనంద్ , కుమారి ప్రశాంతి,  శ్రీ శశి, ఇతర యువత సభ్యులు పాల్గొన్ని మొక్కలను నాటారు. గురుశ్రీ సంతోష్ గారు సహకరించిన విచారణ యువతకి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer