"సాంట్ ఆనా" నందు దివ్యబలిపూజను సమర్పించిన పోప్ లియో

సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుండి కొన్ని అడుగుల దూరంలో ఉన్న సాంట్ అనా విచారణలో ఆదివారం సెప్టెంబర్ 21 న పోప్ లియో దివ్యబలి పూజను సమర్పించారు.
1929 నుండి ఈ దేవాలయము అగస్టీనియన్ సభ వారికి అప్పగించబడింది.ఈ దివ్యబలి పూజలో అగస్టీనియన్ కొత్త prior ఫాదర్ జోసెఫ్ ఫారెల్ కూడా పాల్గొన్నారు
ఇక్కడ సేవ చేస్తున్న అగస్టీనియన్ సభవారికి ముఖ్యంగా ఈ విచారణ గురువు ఫాదర్ Mario Millardi కు మరియు 103 సంవత్సరాల వయస్సు గల ఫాదర్ Gioele Schiavella కు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని పొప్ అన్నారు.
వాటికన్ కు ఈ దేవాలయం ఒక ద్వారముగా అభివర్ణించారు. ఎంతో మంది ప్రతీ రోజు తమ రోజువారీ పని కొరకు,కొందరు అతిథులుగా , యాత్రికులుగా, కొందరు తొందరలో, కొందరు భయం లేదా ప్రశాంతతతో ఈ సరిహద్దులో ఉన్న దేవాలయాన్ని దాటుతారు
ప్రార్థన మరియు దాతృత్వం కొరకు తమ మనస్సును ఎల్లపుడు తెరిచి ఉంచాలని విశ్వాసంలో ఎదుగుతూ ఈ రోజు సువార్త పఠనం పై క్డిసేపు ధ్యానించారు