వాటికన్‌లో ఘనంగా జరిగిన గాయక బృందాల జూబిలీ
వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో నవంబర్ 23 ఆదివారం క్రీస్తురాజు మహోత్సవం నాడు గాయక బృందాల జూబ్లీని జరుపుకున్నారు .
వేలాది మంది యాత్రికులు ఈ దివ్యబలిపూజలో పాల్గొన్నారు.
2025 జూబిలీ సంవత్సరం ముగింపుకు చేరుకునే సమయంలో గాయక బృందాల జూబ్లీ చివరినుండి రెండవది.
క్రీస్తు రాజు పండుగ వేడుకలో, క్రైస్తవులకు పాడటం అంటే ఏమిటో పోప్ వివరించారు.
దేవుని ప్రజల కోసం, పాడటం ప్రార్థన మరియు స్తుతిని వ్యక్తపరుస్తుంది
ఇది పునరుత్థానమైన క్రీస్తు ద్వారా ఆ పరలోక దేవునికి మనలను దగ్గరచేసి,జ్ఞానస్నానం పొందిన వారందరినీ దానిలో భాగస్వాములను చేస్తుంది.
ఒక విధంగా, గాయక బృందం దేవుని స్తుతిస్తూ చరిత్రలో ప్రయాణించే శ్రీసభ చిహ్నం అని మనం చెప్పగలం.
ఈ మార్గం కొన్నిసార్లు కష్టాలు మరియు పరీక్షలతో నిండి ఉన్నప్పటికీ,భాదలో ఉన్నవారికి ఓదార్పుని, అలసటతో ఉన్నవారికి ఉపశమనం కలిపిస్తుంది.
నవంబర్ 22, శనివారం, శ్రీసభ సంగీతానికి సార్వత్రిక పోషకురాలైన పునీత సిసిలియా స్మరణను జరుపుకుంది అని పోప్ అన్నారు .
పునీత సిసిలియా రక్షణకు నేను మీ అందరినీ అప్పగిస్తున్నాను, తనను తాను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకుని, శ్రీసభ పట్ల విశ్వాసం మరియు ప్రేమ సాక్ష్యాన్ని అందించింది.