మీ యవ్వనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించండి

మీ యవ్వనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించండి

పరాగ్వేలోని యువత పరిచర్య సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి  బహుమతిగా' సమర్పించాలని  పిలుపునిచ్చారు.

ప్రభు యేసు క్రీస్తుని జీవితం మనకు ఆదర్శమని, అయన స్వచ్ఛమైన ప్రేమ, కనికరం,మానవాళి కొరకు అయన చేసిన త్యాగం గొప్పదని, ప్రభు యేసు క్రీస్తుని  కొరకు హృదయ ద్వారాలను తెరిచి ఉంచాలని, మన హృదయాలలో ఆయనకు చోటు ఇవ్వాలని అన్నారు. తద్వారా మీ యవ్వనం ప్రభు యేసుకు మరియు ప్రపంచానికి బహుమతిగా ఉంటుంది అని, అప్పుడు  మీరు మీ జీవితాన్ని  విలువైన మరియు ఫలవంతమైన మార్గంలో గడపగలుగుతారు అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

జూలై 15-20 తేదీలలో పరాగ్వేలోని అసున్‌సియోన్‌లో సమావేశమైన కరీబియన్ మరియు లాటిన్ అమెరికా జాతీయ యువజన మంత్రిత్వ శాఖ నాయకుల  సమావేశానికి  మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు పంపిన ప్రోత్సాహం ఇది.

ఈ సందర్భముగా శ్రీసభ  కోసం యువజన పరిచర్య యొక్క విలువను మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు నొక్కిచెప్పారు మరియు  క్రీస్తు శక్తిని గొప్ప పనులు చేయడానికి ఉపయోగించమని యువకులకు పిలుపునిచ్చారు.

మనం పడిపోయిన ప్రతిసారీ మనల్ని పైకి లేపడానికి తన చేతిని అందించే ప్రభువుకు మనకు తోడుగా ఉన్నారు అని, భయపడకూడదని ఆయన అన్నారు. శ్రీసభలో యువత భాగస్వామ్యం ప్రజ్వరిల్లాలని, యువతకు ఎల్లప్పుడు మరియమాత తోడుగా ఉంటారని ,ఉత్సాహంతో ప్రభుని సేవలో, ప్రేమలో వర్ధిల్లాలని యువతను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer