మానవ జీవనానికి సౌభ్రాతృత్వం మూలమన్న పోప్ లియో
నవంబర్ 12 న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో సోదరత్వం అనేది కేవలం ఒక క్రైస్తవ గుణం మాత్రమే కాదు అని పోప్ లియో అన్నారు
సౌభ్రాతృత్వం లేకుండా మనం బ్రతకలేము, ఎదగలేము, నేర్చుకోలేము” అదే మానవ జీవనానికి అత్యంత అవసరం అని తెలిపారు.
ప్రపంచం నేడు విభజనలతో, ఘర్షణలతో నిండిపోయినప్పటికీ, సోదరభావం కలిగి ఉండటంవలనే మనం పరస్పర మన తోటి వారిని పరిరక్షించుకోగలుగుతునాం.
మనం మన గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తే బహుశా మనం ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది,
సోదరత్వం అసాధ్యమైన పని కాదని, అది సువార్తలో నాటుకున్న సాధ్యమైన జీవన మార్గం అని పోప్ గుర్తు చేసారు
అస్సీసీపూరి ఫ్రాన్సిస్ వారి ఆత్మీయ అభివాదం “Omnes fratres” (“అందరం సోదరులమే”) మరియు పోప్ ఫ్రాన్సిస్ Fratelli Tutti అనే లేఖ నుండి ప్రేరణ పొందుతూ, క్రైస్తవ సోదరత్వం యేసు చెప్పిన ఆజ్ఞ “నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి” అనే మాటలలో నుంచే ఉద్భవిస్తుంది అని పోప్ అన్నారు .
“నిజమైన సోదర ప్రేమ ఆ ప్రభువుని త్యాగప్రేమను ప్రతిబింబిస్తుంది
కాబట్టి క్రీస్తు ఇచ్చిన సోదరత్వం మనలను స్వార్థం మరియు విభజన నుండి విముక్తులను చేయాలని ప్రార్దిదాం అని పోప్ ముగించారు