మయన్మార్ ప్రజల కొరకు ప్రార్ధించిన పోప్ లియో
బుధవారం నవంబర్ 5 న సామాన్య ప్రేక్షకుల సమావేశం ముగింపులో, పోప్ లియో ప్రపంచంలోని అనేక సాయుధ పోరాటాల మధ్య బాధపడుతున్న వారిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు
"ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యుద్ధ హింసతో బాధపడుతున్న వారందరి కోసం తనతో కలసి ప్రార్ధించాలని విశ్వాసులను పోప్ ఆహ్వానించారు.
ముఖ్యంగా మయన్మార్ ప్రజల కోసం ప్రార్థించారు, అంతర్జాతీయ సంస్థలు "బర్మీస్ ప్రజలను మరచిపోవద్దని మరియు అవసరమైన మానవతా సహాయం అందించాలని" కోరారు.
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభాలలో ఒకదానిని మయన్మార్ ఎదుర్కొంటున్నందున పోప్ ప్రార్థనలు చేశారు.
వైమానిక దాడులు మరియు పోరాటాల ద్వారా మొత్తం గ్రామాలు నాశనమయ్యాయి, లక్షలాది మందికి ఆహారం, మందులు మరియు ఆశ్రయం అందుబాటులో లేదు.
మయన్మార్ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు మానవతా సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.