మధ్యధరా యువతా మండలి సభ్యులతో సమావేశమైన పోప్

శుక్రవారం సెప్టెంబర్ 5 న మధ్యధరా యువతా మండలి సభ్యులు నిరీక్షణా సంకేతాలుగా ఉండమని పోప్ లియో పిలుపునిచ్చారు
ఈ మండలి వారు సంభాషణ సాధ్యమేనని రుజువు; విభేదాలు సంఘర్షణకు ఉద్దేశ్యం కాదు, సుసంపన్నతకు మూలం అని;
మధ్యధరా సముద్రం సరిహద్దులో ఉన్న దేశాల ప్రతినిధులతో రూపొందించబడిన ఈ కౌన్సిల్, యువత తమ గళ్లాని వినిపించడానికి మరియు పౌర అధికారులతో సంభాషణలో చొరవ తీసుకోవడానికి అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడింది.
విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడానికి, హింసతో నాశనం చేయబడిన నగరాలను పునర్నిర్మించడానికి ఈ ప్రాజెక్టును పోప్ ఫ్రాన్సిస్ ఈ మండలికి అప్పగించారు.
యువతా మండలి సభ్యులను నిరీక్షణా సంకేతాలుగా మరియు సువార్త దూతలుగా ఉండాలని పొప్ పిలుపునిచ్చారు