ఫిలిప్పీన్స్‌లో తుఫాను బాధితుల కొరకు ప్రార్ధించిన పోప్
నవంబర్ 9 ఆదివారం త్రికాల ప్రార్ధన అనంతరం ఫిలిప్పీన్స్‌లో తుఫాను బాధితుల కోరకు మరియు జీవనోపాధిని కోల్పోయిన వారి కొరకు పోప్ లియో ప్రార్ధించారు
తుఫాను వల్ల ప్రభావితమైన ఫిలిప్పీన్స్ ప్రజలకు నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను; మరణించిన వారి కోసం, వారి కుటుంబాల కోసం, గాయపడిన వారి కోసం మరియు స్థానభ్రంశం చెందిన వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను అని పోప్ అన్నారు
యుద్ధాలు మరియు శాంతి కొరకు అన్వేషణ అనే ఇతివృత్తం మరోసారి తన ప్రసంగం ముఖ్య ఉదేశమైనది.
యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో పనిచేసే వారందరికీ పోప్ కృతజ్ఞతలు తెలియచేస్తూ, సంఘర్షణల కారణంగా జరిగిన ప్రాణనష్టం గురించి విచారం వ్యక్తం చేశారు.
ఎప్పటినుండో కొనసాగుతున్న యుద్ధం వల్ల ఎంతో మంది మరణించారు, అందులో పిల్లలు, వృద్ధులు మరియు రోగులు ఉన్నారు.
మనం నిజంగా వారి జ్ఞాపకాలను గౌరవించాలనుకుంటే, కాల్పుల విరమణ జరగాలి మరియు దేశాల మధ్య చర్చలు ప్రారంభమ్మవాలి అని పోప్ అన్నారు