ప్రపంచ పేదల దినోత్సవ దివ్యబలిపూజను సమర్పించిన పోప్

16 నవంబర్ తొమ్మిదవ ప్రపంచ పేదల దినోత్సవం నాడు, సెయింట్ పీటర్స్ బసిలికాలో దాదాపు 6,000  యాత్రికులకు పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు 

భయానికి లొంగకుండా, క్రైస్తవులు ఆశతో స్థిరపడాలి, ఎందుకంటే ప్రభువు "మన తల వెంట్రుకలను కూడా నశించనివ్వడు" ఆయన "నీతి సూర్యుడు" అని పోప్ అన్నారు.

"మన వ్యక్తిగత జీవితాలలో మరియు సమాజంలో హింస, బాధ, పోరాటాలు మరియు అణచివేత మధ్య, దేవుడు మనల్ని విడిచిపెట్టడు" అని పోప్అన్నారు.

ఈ ప్రపంచ పేదల దినోత్సవం సందర్బంగా పోప్ లియో "డిలెక్సీ తే, నేను నిన్ను ప్రేమించాను." అనే తన మొదటి అపోస్టోలిక్ ఉద్బోధ ప్రారంభ మాటలను గుర్తుచేసుకున్నారు  

శ్రీసభ  పేదలకు తల్లిగా ఉండటానికి , దాని భారం పడిన వారికి న్యాయం అందించడానికి ప్రయత్నిస్తుంది.

"చాలా రకాల పేదరికం మన ప్రపంచాన్ని పీడిస్తుంది!" దీనిలో భౌతిక పేదరికం, నైతిక మరియు ఆధ్యాత్మిక పేదరికం యువతను బాధిస్తుందని పోప్అన్నారు.

మనం మన కార్యాలయంలో ఉన్నా, లేదా మన కుటుంబంతో ఉన్నా, ఇతరులపై శ్రద్ధ వహించాలని పోప్ విశ్వాసులను ఆహ్వానించారు, దేవుని ఆప్యాయతకు సాక్షులుగా నిలిచేందుకు మనకు అనేక అవకాశాలు ఉన్నాయని పోప్ గుర్తుచేశారు