పాంఫికల్ హౌస్‌హోల్డ్‌కు వైస్ రీజెంట్‌ను నియమించిన పోప్

నవంబర్ 10 న అగస్టీనియన్ సభ కు చెందిన  ఫాదర్ ఎడ్వర్డ్ డానియాంగ్ డాలెంగ్, O.S.A.ని పాంటిఫికల్ హౌస్‌హోల్డ్ ప్రిఫెక్చర్‌కు నూతన వైస్ రీజెంట్‌గా పోప్ లియో నియమించారు.

ఫాదర్ ఎడ్వర్డ్ గతంలో ఆర్డర్ ఆఫ్ సెయింట్ అగస్టీన్‌కు జనరల్ కౌన్సెలర్ మరియు ప్రొక్యూరేటర్ జనరల్‌గా పనిచేశారు.

ఏప్రిల్ 4, 1977న నైజీరియాలోని Kwallaలోని Yitla’arలో జన్మించారు.

నవంబర్ 13, 2004న సెయింట్ అగస్టీన్‌ సభలో తన మొదటి మాట పట్టును చేపట్టారు.

సెప్టెంబర్ 10, 2005న గురువుగా అభిషేకింపబడ్డారు మరియు 2012లో అల్ఫోన్సియన్ అకాడమీ నుండి నైతిక వేదాంతశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.

పోప్ లియో ఎన్నికైన కొద్దిసేపటికే వాటికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫాదర్ డాలెంగ్ పోప్‌కు ఆఫ్రికాతో ఉన్న ప్రత్యేక బంధం గురించి మాట్లాడారు.

"ఆయన మన ఆఫ్రికన్ మిషన్లన్నింటినీ చాలాసార్లు సందర్శించారు మరియు ఎన్నోసార్లు  నా దేశమైన నైజీరియాకు వచ్చారు అని ఫాదర్ ఎడ్వర్డ్ అన్నారు