పవిత్ర గ్రంథ విభాగ సభ్యులతో సమావేశమైన పోప్
కాథలిక్ బిబ్లికల్ ఫెడరేషన్ (పవిత్ర గ్రంథ విభాగ)సభ్యులతో సోమవారం నవంబర్ 17 పోప్ లియో సమావేశమయ్యారు.
కతోలిక శ్రీసభ జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలో ఒకటైన పరిశుద్ధ గ్రంథ విభాగం వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న పోప్ యువతకు దైవవాక్కు సులభంగా అర్థం చేసుకునే విధానాలను రూపొందించాలని ఆకాంక్షించారు.
ఈ రోజుల్లో యువత డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా గడుపుతారు కాబట్టి, దైవవాక్యము అక్కడే వెలుగుందే దిశగా శ్రీసభ పెద్దలు కృషి చూపాలని పోప్ కోరారు.
ద్వితీయ వాటికన్ కౌన్సిల్ యొక్క ఆధారగ్రంథమైన "Dei Verbum" పత్రం ప్రచురితమై నేటికీ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమస్త క్రైస్తవులు దైవవాక్కును భక్తితో ఆలకించాలని,విశ్వాసముతో ప్రకటించాలని పోప్ గుర్తు చేశారు.
బైబిలు పండితులు, బైబిలు ప్రచారకులు అందరూ యేసుక్రీస్తు వాక్కును ప్రజలకు శక్తివంతంగా అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.