నూతన పీఠాధిపతులతో సమావేశమైన పోప్ లియో

సెప్టెంబర్ 11, గురువారం నాడు వాటికన్‌లోని సినడ్ హాల్‌లో తన ప్రేక్షకుల సమావేశం అనంతరం కొత్తగా నియమితులైన పీఠాధిపతులతో పోప్ లియో సమావేశమైయ్యారు     

పీఠాధిపతులు తమ పరిచర్య ప్రారంభంలో ఎదుర్కొనే సవాళ్లు మరియు సమస్యలపై” పోప్ లియో దృష్టి సారించారు.

భయాలు, అనర్హత భావాలు మరియు వారి పిలుపుకు ముందు ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఉన్న విభిన్న అంచనాలు” వంటి వాటిపై మాట్లాడారు అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ఒక ప్రకటనలో ప్రకారం.

ప్రభువుకు దగ్గరగా ఉండాలని, ప్రార్థనకు సమయాన్ని వెచ్చించాలని మరియు వారి పిలుపుకు మూలమైన పరిశుద్ధాత్మపై నమ్మకంతో జీవించడం కొనసాగించాలని పోప్ వారిని కోరారు.