దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్
శనివారం నవంబర్ 8 ఉదయం వాటికన్‌లో దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడు Cyril Ramaphosa ను పోప్ లియో కలిసారు
దక్షిణాఫ్రికాలో ప్రాంత్రీయ శ్రీసభ అందిస్తున్న సేవను,ముఖ్యంగా "విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో" అందించే విలువైన సహకారానికి పరస్పర ప్రశంసలు వ్యక్తమయ్యాయి అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది
"సమాజంలో ఐక్యత, పరస్పర సంభాషణ మరియు సయోధ్యను పెంపొందించడానికి శ్రీసభకు నిరంతర నిబద్ధతకు" గుర్తింపు కూడా ఉందని ప్రకటన పేర్కొంది.