తైవాన్ భూకంప బాధితులకు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సంఘీభావం తెలిపారు

తైవాన్ భూకంప బాధితులకు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సంఘీభావం తెలిపారు

 

 తైవాన్‌లో భారీ భూకంపం ఘటనపై పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు స్పందించారు. మృతుల కుటుంబాలకు  సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని  ప్రార్ధించారు.  ఫ్రాన్సిస్  పాపు గారు గురువారం నాడు  తన సంతాపాన్ని పంపారు, కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్‌లో  తైవాన్‌లోని చైనీస్ ప్రాంతీయ పీఠాధిపతుల కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మహా పూజ్య జాన్ బాప్టిస్ట్ లీ కెహ్-మీన్‌కు పంపారు.

1999 తర్వాత తైవాన్‌లో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇది. ఈ  భూకంపం లో  9 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికిపైగా గాయపడ్డారు. మరో 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. హువాలియన్‌ కౌంటీలో ఐదంతస్థుల భవనం మొదటి అంతస్థ వరకు భూమిలో కూరుకుపోయి 45 డిగ్రీల దశలో పక్కకు ఒరిగింది. ఈ భూకంప సంఘటన తైవాన్, దక్షిణ జపాన్ మరియు ఫిలిప్పీన్స్‌లకు సునామీ హెచ్చరికలను జారీ చేసారు .

ఫ్రాన్సిస్  పాపు గారు "చనిపోయిన వారి కొరకు , గాయపడినవారు మరియు స్థానభ్రంశం చెందిన వారందరి కోసం, అలాగే సహాయక చర్యలలో పాల్గొన్న  అత్యవసర సిబ్బంది కోసం" ప్రత్యేకించి  ప్రార్థించారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer