ఇరాక్ కు నూతన అపోస్టోలిక రాయబారిని నియమించిన పోప్

సెప్టెంబర్ 18న ఇప్పటివరకు రాష్ట్రాలతో సంబంధాలకు అండర్ సెక్రటరీగా ఉన్న ఆర్చ్ బిషప్ Mirosław Stanisław ను ఇరాక్ కు నూతన అపోస్టోలిక రాయబారి గా పోప్ లియో నియమించారు
ఈ నియామక ప్రకటనను రాష్ట్ర సచివాలయంలోని మూడు విభాగాల సమక్షంలో రాష్ట్రాలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ చేశారు.
వీరు మే 8, 1970న పోలాండ్ లో జన్మించారు,15 జూన్ 1996న గురువుగా అభిషేకింపబడరు.
ఈయన కానన్ లాలో డిగ్రీ పొందారు.
జూలై 1, 2004న హోలీ సీ దౌత్య సేవలో ప్రవేశించి, సెనెగల్ పోంటిఫికల్ ప్రాతినిదిగా , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కు, యూరప్‌లోని భద్రత మరియు సహకార సంస్థ (OSCE), మరియు వియన్నాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం మరియు ప్రత్యేక సంస్థలలో,పోలాండ్‌లోని అపోస్టోలిక్ నన్షియేచర్‌లో సేవలందించారు.
2019 నుండి హోలీ సీ దౌత్యవేత్త రాష్ట్రాలతో సంబంధాలకు అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.