అంతర్జాతీయ వేదాంత విభాగ సభ్యులుగా 24 మందిని నియమించిన పోప్
సోమవారం అక్టోబర్ 20 న అంతర్జాతీయ వేదాంత విభాగానికి 24 మంది నూతన సభ్యులను పోప్ నియమించారు. గత ఐదేళ్ల పదవీకాలంలో సేవలందించిన మరో ఆరుగురి నియామకాలను పునరుద్ధరించారు.
2026–2031 కాలానికి సంబంధించిన నియమాకాలు జరిగాయి. గత పదవీకాలంలో 28 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 30కి పెరిగింది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన వారికి ఈసారి మరింత ప్రాతినిధ్యం కల్పించారు.
ఈ విభాగ సెక్రటరీ జనరల్‌గా సేవలందిస్తున్న మోన్సిగ్నోర్ పియెరో కోడాతో పాటు మరో ఐదుగురి పదవీకాలాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించారు.
సిద్ధాంతపరంగా ప్రాధాన్యమున్న, సమకాలీన అంశాలను పరిశీలించి, వాటిపై హోలీ సీకి, ముఖ్యంగా విశ్వాస సిద్ధాంతాల విభాగానికి సహాయం చేయడం దీని ప్రధాన బాధ్యత.
వివిధ దేశాలు, వేదాంత ఆలోచనా విధానాలకు చెందిన వేదాంత పండితులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ప్రాంతాలవారీగా సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి:
- యూరప్: గతంలో 14 మంది ఉండగా, ప్రస్తుతం 13 మంది.
- ఆసియా: గతంలో ముగ్గురు ఉండగా, ప్రస్తుతం నలుగురు.
- ఆఫ్రికా: గతంలో ముగ్గురు ఉండగా, ప్రస్తుతం నలుగురు.
- దక్షిణ అమెరికా: గతంలో నలుగురు ఉండగా, ప్రస్తుతం ఐదుగురు.
- ఉత్తర అమెరికా: ముగ్గురు సభ్యులు.
- ఆస్ట్రేలియా: ఒక సభ్యుడు.
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించిన వివరాల ప్రకారం, కొత్తగా నియమితులైన సభ్యులు:
1. మోన్సిగ్నోర్ కార్లో డెల్'ఒస్సో – పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్కియాలజీ కార్యదర్శి.
2. మోన్సిగ్నోర్ లుబోమిర్ జాక్ – చెక్ రిపబ్లిక్‌లోని పాలాకీ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన సెయింట్స్ సిరిల్ అండ్ మెథోడియస్ వేదాంత విభాగంలో ప్రొఫెసర్.
3. ఫాదర్ ఖలీద్ ఇమ్మాన్యుయేల్ అనటోలియోస్ – అమెరికాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయ వేదాంత విభాగాధిపతి.
4. ఫాదర్ ఏంజెల్ కొర్డోవిల్లా పెరెజ్ – స్పెయిన్‌లోని మాడ్రిడ్ కొమిల్లాస్ పొంటిఫికల్ విశ్వవిద్యాలయ వేదాంత, కానన్ లా విభాగాల డీన్.
5. ఫాదర్ టియాగో డి ఫ్రాగా గోమ్స్ – బ్రెజిల్‌లోని పొంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ రియో గ్రాండే డో సుల్లో ప్రొఫెసర్.
6. ఫాదర్ గిల్బర్ట్ డి లిమా – భారత కాథలిక్ బిషప్స్ సమాఖ్య వేదాంత, సిద్ధాంత కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి.
7. ఫాదర్ క్లారెన్స్ దేవదాస్ – మలేషియాలోని కౌలాలంపూర్ కాథలిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్.
8. ఫాదర్ ఫాబ్రిసియో లియోనెల్ ఫోర్కాట్ – అర్జెంటీనాలోని పొంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అర్జెంటీనా వేదాంత విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.
9. ఫాదర్ జూలియన్ ఆర్టురో లోపెజ్ అమోజుర్రుటియా – పొంటిఫికల్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో వేదాంత విభాగం డీన్.
10. ఫాదర్ గాస్టన్ ఓగుయి కొస్సి – పశ్చిమ ఆఫ్రికా కాథలిక్ విశ్వవిద్యాలయంలోని బోబో-డియౌలాసో విభాగం డీన్.
11. ఫాదర్ క్సాబా టోరోక్ – హంగరీలోని ఎస్టెర్గోమ్ వేదాంత కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్.
12. ఫాదర్ పాల్ బెరే, ఎస్.జె. – రోమ్‌లోని పొంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయానికి చెందిన పొంటిఫికల్ బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ విభాగం డీన్.
13. ఫాదర్ మిషెల్ ఫెడూ, ఎస్.జె. – ఫ్రాన్స్‌లోని ఫాకుల్టే లోయోలా పారిస్ వేదాంత విభాగం ఎమెరిటస్ ప్రొఫెసర్.
14. ఫాదర్ బెర్న్‌హార్డ్ నోర్న్, ఎస్.జె. – జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో సాంక్ట్ గియోర్గెన్ ఫిలాసఫీ అండ్ థియాలజీ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్.
15. ఫాదర్ పాట్రిక్ మ్వానియా, సి.ఎస్.ఎస్పి. – కెన్యాలోని నైరోబీ టంగాజా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్.
16. ఫాదర్ జార్జ్ అలెహాండ్రో స్కాంపిని, ఓ.పి. – అర్జెంటీనాలోని పొంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అర్జెంటీనాలో ప్రొఫెసర్.
17. సిస్టర్ షు చిన్ (మరియా తెరెసా) హు, ఎఫ్.ఐ. – తైవాన్‌లోని ఫు జెన్ సెయింట్ రాబర్ట్ బెల్లార్మైన్ వేదాంత విభాగంలో అసాధారణ ప్రొఫెసర్.
18. ప్రొఫెసర్ తెరెసా హ్యోన్ సూన్ చోయ్ – దక్షిణ కొరియాలోని సోగాంగ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్.
19. ప్రొఫెసర్ బోయ్డ్ టేలర్ కూల్మన్ – అమెరికాలోని బోస్టన్ కాలేజీ వేదాంత విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.
20. ప్రొఫెసర్ మరియా తెరెసా ఫత్తోరి – ఇటలీలోని టెరామో విశ్వవిద్యాలయ పరిశోధకురాలు.
21. ప్రొఫెసర్ క్లాడియా లియాల్ లూనా – రోమ్‌లోని పొంటిఫికల్ జాన్ పాల్ II థియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ సైన్సెస్‌లో ప్రొఫెసర్.
22. ప్రొఫెసర్ సారా పార్విస్ – యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ వేదాంత విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.
23. ప్రొఫెసర్ యాన్-హైనర్ ట్యూక్ – ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయంలో డాగ్మాటిక్ థియాలజీ, డాగ్మా చరిత్ర విభాగాధిపతి.
24. ప్రొఫెసర్ ఆన్-సోఫీ వివియే-మురెసాన్ – ఫ్రాన్స్‌లోని కాథలిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారిస్ వేదాంత విభాగం డీన్.
శ్రీసభ సిద్ధాంతపరమైన సేవలో కమిషన్ పాత్ర
1969లో ఆరో పౌలు పోప్ అంతర్జాతీయ వేదాంత కమిషన్‌ను అప్పటి విశ్వాస సిద్ధాంతాల సంఘం పరిధిలో స్థాపించారు.
