హిజ్రాల చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణి

హైదరాబాద్‌ అగ్రపీఠం,రసూల్పురా ఇందిరమ్మనగర్ లోని సీఎఫ్సీఐ క్రిస్టియన్ సంస్థ కార్యాలయంలో హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు జూలై 5, 2023న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటి వారి చేతుల మీదుగా స్థానిక పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. 

ట్రాన్స్ జెండర్ల పట్ల సానుకూల దృక్పథంతో వారిని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని HASSS నిర్వాహకురాలు మాల గారు అన్నారు. 

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని ఆదేశాల మేరకు, హెచ్ఎస్ఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ మాదాను ఆంథోని పర్యవేక్షణలో ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  

ఈ మేరకు జియో సౌజన్యంతో పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లను భాగస్వాములను చేశామన్నారు. 

భవిష్యత్లో ట్రాన్స్ జెండర్లకు వృత్తి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తమ సంస్థ సహకారం పొందాలనుకునే ట్రాన్స్ జెండర్లు 7729889207 నెంబరు కాల్ చేయ వచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో రేఖ, సుధ తదితరులు పాల్గొన్నారు.

Tags