నూతన పోప్ ను ఎన్నుకోవడానికి రోమ్ నగరంలో కార్డినల్ల సమావేశం

ఏప్రిల్ 21న 88 సంవత్సరాల వయసులో మరణించిన పోప్ ఫ్రాన్సిస్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన వారసుడిని ఎన్నుకోవడానికి 135 మంది కార్డినల్-ఎలక్టర్లు వాటికన్‌లో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

నూతన పోప్ ను ఎన్నుకునే వాళ్లలో పోప్ ఫ్రాన్సిస్ నియమించిన కార్డినల్లు 80% మంది ఉన్నారు.

135 మంది అర్హత కలిగిన ఓటర్లలో, ఇటీవలి చరిత్రలో ఒకే పోప్ నియమించిన పాపల్ ఓటర్లలో అత్యధిక నిష్పత్తి 108 (80%) మందిని పోప్ ఫ్రాన్సిస్ నియమించారు, మిగిలిన వారిలో పోప్ బెనెడిక్ట్ XVI నియమించిన 22 (16.3%) మరియు పోప్ జాన్ పాల్ II నియమించిన ఐదుగురు (3.7%) ఉన్నారు.

ప్రస్తుత కార్డినల్ ప్రాతినిధ్యం
ఇటలీ నుండి 12.6% (17 కార్డినల్లు )
ఆసియా నుండి 17.0% (23 కార్డినల్లు)
ఆఫ్రికా నుండి 13.3% (18 కార్డినల్లు)
దక్షిణ అమెరికా నుండి  12.6% (17 కార్డినల్లు)
ఉత్తర అమెరికా నుండి 14.8% (20 కార్డినల్లు)
మొత్తం యూరప్ నుండి 39.3% (53 కార్డినల్లు)

రాబోయే వారాల్లో ప్రారంభం కానున్న ఈ సమావేశం, తదుపరి రోమ్ బిషప్‌ను ఎన్నుకోవడానికి 
80 ఏళ్లలోపు వయస్సు ఉన్న నలుగురు భారతీయ కార్డినల్లు ఓటు వేయడానికి అర్హులు. 

హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోనీ, గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఫిలిప్ నేరి, సిరో-మలంకర కాథలిక్ చర్చి మేజర్ ఆర్చ్ బిషప్-కాథలికోస్ కార్డినల్ Baselios Cleemis Thottunkal మరియు కేరళాకు చెందిన Cardinal George Koovakad ఉన్నారు