కాసా సాంటా మార్టా పొప్ నివాసాన్ని మూసివేసిన వాటికన్ అధికారులు.

ఏప్రిల్ 21 సోమవారం సాయంత్రం పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని నిర్ధారించే ప్రక్రియ తరువాత వాటికన్ నివాసం కాసా సాంటా మార్టాలోని ప్రార్థనా మందిరంలో ఆయన భౌతికకాయాన్ని శవపేటికలో ఉంచడం జరిగింది.

ఈ చర్యను రోమ్, కామెర్లెంగోకు చెందిన కార్డినల్ కెవిన్ ఫారెల్ ధృవీకరించి అధికారిక ప్రకటనను చదివారు. ఈ ప్రక్రియ ఒక గంటసేపు కొనసాగింది.

అపోస్టోలిక్ ప్యాలెస్ లోని మూడవ అంతస్తులో, పోప్ నివసించిన కాసా సాంటా మార్టా రెండో అంతస్తులో కూడా సీల్స్ వేయడం జరిగింది 

మంగళవారం ఏప్రిల్ 22,2025 ఉదయం, కార్డినల్ల మొదటి సామాన్య సమావేశం జరిగింది. దీనిలో అంత్యక్రియలకు సంభావ్య తేదీని నిర్ణయించారు.