సలేసియన్ శతాబ్ది వేడుకలలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

కోల్‌కతా ప్రావిన్స్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబరు 9 నుండి 12 వరకు సొనాడలో సలేసియన్ కాలేజ్, డాన్ బాస్కో మిషన్ సెమినార్‌లో గణనీయమైన సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

భారతదేశంలో మొదటి సలేసియన్ ప్రావిన్స్ 1926లో స్థాపించబడింది .

డాన్ బాస్కో సేలేషియన్లు మొదట 1922లో ఈశాన్య భారతదేశంలోని షిల్లాంగ్‌కు వచ్చారు 

కోల్‌కతా ప్రావిన్స్ ఎప్పుడు నాలుగు ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.

"రిజువనేటింగ్ ది మిషన్ - 100 ఇయర్స్ ఆఫ్ సేలేసియన్స్ ఇన్ కోల్‌కతా" అనే సెమినార్ డార్జిలింగ్ మేత్రాసన, కళాశాల ప్రార్థనా మందిరంలో వికార్ జనరల్ గురుశ్రీ విక్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ గారి అధ్యక్షతన దివ్యబలి పూజతో ఈ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి

ప్రారంభ సెషన్‌లో కోల్‌కతా సలేసియన్ ప్రావిన్షియల్, సలేసియన్ కళాశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిలిగురి,సొనాడ క్యాంపస్‌ల నుండి రెక్టార్‌లతో పాటు ఒక పీఠాధిపతి మరియు అగ్రపీఠాధిపతులతో సహా ప్రముఖులు హాజరయ్యారు   

వీరిద్దరూ 1938లో స్థాపించబడిన సొనాడ సలేసియన్ కళాశాల పూర్వ విద్యార్థులు.

కోల్‌కతా ప్రావిన్షియల్, గురుశ్రీ డాక్టర్ జోసఫ్ పారియా, కోల్‌కతా ప్రావిన్స్ యొక్క సంక్షిప్త చరిత్రను, దానికి సహకారాన్ని అందించిన ప్రముఖ మార్గదర్శకుల గురించి వివరించారు 

ఈ కార్యక్రమంలో దాదాపు 120 మందిలో 60 మందికి పైగా సలేసియన్ గురువిద్యార్థులు విద్యార్థులు, వ్యాఖ్యాతలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు, 

పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సొనాడ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

1976 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి మియావో పీఠాధిపతులు జార్జ్ పల్లిపర్ంబిల్ కీలక ఉపన్యాసం చేయగా, సలేసియన్ కాలేజీలో మాజీ డీన్ ఆఫ్ స్టడీస్, గౌహతికి  విశ్రాంత అగ్రపీఠాధిపతులు థామస్ మేనంరంపిల్ అధ్యక్ష ఉపన్యాసం అందించారు.

కళాశాల గాయక బృందం కోల్‌కతాకు చెందిన పూర్వ విద్యార్థి గురుశ్రీ జాకబ్ ఇరుప్పకట్టు గారు స్వరపరిచిన శతాబ్ది  గీతంతో ఈ సమావేశం ముగిసింది.