జూబిలీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి, పవిత్ర సిలువను ప్రతిష్టించిన కార్డినల్ పూల అంతోని

జూబిలీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి, పవిత్ర సిలువను ప్రతిష్టించిన కార్డినల్ పూల అంతోని

డిసెంబర్ 29 వ తేదీ 2024 న  ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ అగ్రపీఠం, గన్ ఫౌండ్రి, సెయింట్ జోసఫ్ బృహత్  దేవాలయము నందు జూబిలీ 2025 "నిరీక్షణా యాత్రికులు" వేడుకలను ప్రారంభించారు.

ఈ వేడుకను హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ఘనంగా ప్రారంభించారు.

రోసరీ కాన్వెంట్ లో దివ్యబలి పూజను ప్రారంభించి జూబిలీ 2025 సిలువను అగ్రపీఠాధిపతుల వారు ప్రతిష్టించారు.

పిల్లలు, యువతీయువకులు, మఠవాసులు, గురువులతో కలసి అగ్రపీఠాధిపతుల వారు పవిత్ర  సిలువను చేతబూని రోసరీ కాన్వెంట్ నుండి ప్రదక్షణగా బయలుదేరి సెయింట్ జోసఫ్ బృహత్  దేవాలయములోనికి ప్రవేశించారు.

సెయింట్ జోసఫ్ బృహత్ ద్వారము దగ్గర అగ్రపీఠాధిపతుల వారు పవిత్ర సిలువతో అందరిని ఆశిర్వదించారు.

2025 జూబిలీ "నిరీక్షణా యాత్రికులు" అయిన విశ్వాసులను కలిసి ప్రయాణం చేయాలని, మహోన్నత దేవుని యొక్క దీవెనలు పొందాలి అని పొప్ ఫ్రాన్సిస్ గారి పిలిపుని తెలియచేసి, తాను కూడా గురువులను, మఠవాసులను నిరీక్షణతో, విశ్వాసముతో జీవించమని పిలుపునిచ్చారు 

హైదరాబాద్ అగ్రపీఠంలో గల 12 డీనరీలలో 2025 జూబిలీ పవిత్ర సిలువ ఉండాలి అని 12 డీనరీ గురువులకు అగ్రపీఠాధిపతుల వారు ఈ పవిత్ర సిలువను అందచేశారు.

జూబిలీ సందర్బంగా హైదరాబాద్ అగ్రపీఠంలో ఐదు పుణ్యక్షేత్రాలను దర్శించాలని వాటిని కార్డినల్ గారు 
1.సెయింట్ జోసెఫ్ కథడ్రల్, గన్ ఫౌండ్రి
2. ⁠సెయింట్ మేరీస్ బసిలికా, సికింద్రాబాద్
3. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, ఖైరతాబాద్ 
4. పునీత అంథోని వారి పుణ్యక్షేత్రం, మెట్టుగూడ  
5. దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం, ఎంజాల ను  ప్రకటించడం జరిగింది.

ప్రతి ఒక్కరు భక్తి విశ్వాసంతో, సిద్ధపడి ఈ ఐదు పుణ్యక్షేత్రాలను దర్శించి దేవుని దీవెనలు ఈ జూబిలీ సందర్బంగా పొందాలని కార్డినల్ గారు ప్రేమతో ఆహ్వానించారు 

పవిత్ర సిలువను అందుకున్న 12 డీనరీ గురువులు, పుణ్యక్షేత్ర గురువులు అందరు కూడా ఈ జూబిలీ సందర్బంగా వారి పరిధిలో ఉన్న ప్రతీ కుటుంబాన్ని, విచారణను, గ్రామ్మాన్ని సందర్శించి ప్రజలకు జూబిలీ మహోత్సవ దైవ ఆశీస్సులను అందచేయాలని ప్రత్యేకవిధంగా కార్డినల్ గారు కోరారు.

ఈ జూబిలీ 2025 పవిత్ర సిలువ ప్రతిష్టకు సిద్ధం చేసిన మొన్సిగ్నోర్ ఏరువ బాలశౌరి గారికి, సహాయక గురువులకు,మఠవాసులకు,  విచారణ విశ్వాసులకు, గాయక బృందానికి కార్డినల్ గారు కృతజ్ఞతలు తెలిపారు. 

మొన్సిగ్నోర్ ఏరువ బాలశౌరి గారు కూడా ఈ జూబిలీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి, పవిత్ర సిలువను ప్రతిష్టించి, దివ్యబలి పూజను సమర్పించిన అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారికి, విచ్చేసిన గురుపుంగవులకు,మఠవాసులకు, విచారణ విశ్వాసులకు, గాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags