కోర్సికాలో ప్రపంచంలో శాంతి కొరకు విజ్ఞప్తి చేసిన పోప్ ఫ్రాన్సిస్

డిసెంబర్ 15 , ఫ్రెంచ్ ద్వీపం కోర్సికాను సందర్శించిన పొప్ ఫ్రాన్సిస్ గారు  " ప్రపంచ శాంతి కొరకు తన అత్యవసర విజ్ఞప్తిని పునరుద్ధరించారు.

సముద్రానికి ఎదురుగా ఉన్న అన్ని దేశాలకు, ముఖ్యంగా మరియతల్లి యేసు ప్రభువుకు జన్మనిచ్చిన పవిత్ర భూమిలో  శాంతి" అని ఆదివారం త్రికాల ప్రార్థన పఠనానికి ముందు పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

ఫ్రెంచ్ ద్వీపం కోర్సికాలోని పీఠాధిపతులు, మతాధికారులు మరియు దైవప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ " యుద్ధంలో దెబ్బతిన్న దేశాల కొరకు" ప్రార్థనా ఆవశ్యకతను అయన వివరించారు.

కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం, దివ్యబలి పూజ సమర్పించడం మరియు విశ్వాసులను కలవడం ఈ ఒక రోజు అపోస్తొలిక సందర్శనలో భాగమయ్యాయి.

“యుద్ధం ఎప్పుడూ ఓటమి, పాలస్తీనాకు, ఇజ్రాయెల్‌కు, లెబనాన్‌కు, సిరియాకు,మయన్మార్‌కు మొత్తం మధ్యప్రాచ్యానికి శాంతి కొరకు ఆయన ప్రార్థించారు

Tags