అర్చనా ప్రసంగాలు విశ్వాసుల దృష్టి కేంద్రీకరించేలా ఉండాలి అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్
2024 డిసెంబర్ 4, బుధవారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో "బోధకులు సువార్తా ప్రచారాన్ని పవిత్రాత్మ శక్తితో చేయాలన్న" పోప్ ఫ్రాన్సిస్
క్రైస్తవ బోధన యొక్క రెండు నిర్మాణాత్మక అంశాలను వివరించారు , "మొదటిది సువార్త విషయ సూచిక మరియు రెండవదిగా పరిశుద్ధ ఆత్మ ప్రేరణ ద్వారా దాని అర్థం" అని ఆయన అన్నారు
మన బోధించే విషయ సూచిక పై మాట్లాడుతూ నూతన నిబంధనలో "సువార్త" అనే పదాన్ని ఉపయోగించడాన్ని గుర్తు చేసారు
దీనికి రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయని, ఇది నాలుగు కానానికల్ సువార్తలలో (మత్తయి,మార్కు, లూకా మరియు యోహాను ) ఏదైనా ఒకదానిని సూచించినప్పుడు, ఈ పదానికి "యేసు తన భూజీవితంలో ప్రకటించిన సువార్త" అని అర్థం.
అయితే, మొదటి ఈస్టర్ తర్వాత, "సువార్త" అనే పదానికి "యేసు గురించిన శుభవార్త, అంటే క్రీస్తు మరణం మరియు పునరుత్థానం యొక్క దైవ రహస్యం" అని దాని కొత్త అర్థాన్ని తెలియపరించింది అని పోప్ అన్నారు
"సువార్త ప్రకటించబడిన మార్గాలను మనం గుర్తుంచుకోవాలి." అని ఆయన రెండు అంశాలలో రెండవది "బోధించే సాధనాలు" గురించి మాట్లాడారు
ఆలోచనతో, సిద్ధాంతాలతో, జీవంతో, లోతైన నిశ్చయతతో పరిశుద్దాత్మ ప్రేరణతో సువార్త ప్రచారం చేయాలని ఆయన అన్నారు .
బోధకులు తమ అర్చనా ప్రసంగాలు ఎప్పుడూ 10 నిమిషాలకు మించి వెళ్లవద్దు అని,అవి
"ఒక ఆలోచన, ఒక మానసిక భావము మరియు ఒక క్రియకు ఆహ్వానిస్తున్నట్లుగా " గరిష్టంగా 10 నిమిషాల్లో ప్రసంగించాలని కోరారు.
"8 నిమిషాల తర్వాత, అర్చనా ప్రసంగాల ఉపదేశం చెదిరిపోతుంది మరియు ఎవరికీ అర్థం కాలేదు," అని బోధకులకు సూచించారు
బోధకులు, తమ బోధనలతో క్రీస్తును ప్రకటించడానికి పరిశుద్ధాత్మ కృప కోసం తప్పనిసరిగా ప్రార్థించాలని ఆయన అన్నారు.
రెండవది, బోధకులు తమను తాము బోధించకూడదు కానీ యేసు ప్రభువు గురించి ఆయన మహిమ గురించి భోదించాలి అని పొప్ ఫ్రాన్సిస్ గారు ముగించారు .