క్రైస్తవులు 'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు

క్రైస్తవులు 'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సీస్ పాపు గారు క్రైస్తవులను "ప్రేమపూర్వక చర్యలు మరియు ఆత్మ ఫలాల" ద్వారా వారి విశ్వాసాన్ని ప్రతిబింబించమని ప్రోత్సహించారు.
పరిశుద్ధ ఫ్రాన్సీస్ పాపు గారు ఆగస్ట్ 21న తన వారపు సాధారణ ప్రేక్షకుల తో మాట్లాడుతూ , యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు "పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు " అని చెప్పారు, అయితే పాత నిబంధన రాజులు, ప్రవక్తలు మరియు గురువులు సుగంధ నూనెతో అభిషేకించబడ్డారు అని తెలిపారు .
ప్రతి సంవత్సరం క్రిస్టమ్ మాస్ (తైలాల దివ్యబలి పూజ) సందర్భంగా, పీఠాధిపతులు బాప్తిస్మం, ధృవీకరణలలో ఉపయోగించే పవిత్ర తైలాలను ఆశీర్వదిస్తారని, ఆ నూనెల గ్రహీతల జీవితం సంతోషకరమైన మరియు సువాసనతో నిండివుండాలని వారు ప్రార్థిస్తారు అని తెలిపారు.
"దురదృష్టవశాత్తూ, కొన్నిసార్లు క్రైస్తవులు క్రీస్తు సువాసనను వ్యాపింపజేయరు, కానీ వారి స్వంత పాపపు దుర్వాసనను వ్యాప్తి చేస్తారని మాకు తెలుసు" అని ఫ్రాన్సీస్ పాపు గారు అన్నారు.
గలతీయులకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ "క్రీస్తు యొక్క సువాసన ఆత్మ యొక్క ఫలాల నుండి వెలువడుతుంది అని , అవి ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు. మనం ఈ పండ్లను పండించడానికి కృషి చేస్తే, మనకు తెలియకుండానే, మన చుట్టూ ఉన్న వారు మనం వ్యాప్తిచేసే క్రీస్తు ఆత్మ యొక్క సువాసనను ఎవరైనా గమనిస్తారు," అని ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు.
చివరిగా ఫ్రాన్సిస్ పాపు గారు తన ప్రేక్షకులకు ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రార్థించవలసిందిగా కోరారు, అలాగే మయన్మార్, దక్షిణ సూడాన్, కాంగో, పాలస్తీనా మరియు ఇజ్రాయెల్‌లలో శాంతి కోసం ప్రార్థించవలసిందిగా విశ్వాసులని కోరారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer