ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలతో తన సమావేశాన్ని ప్రకటించిన పొప్ ఫ్రాన్సిస్ గారు


ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలతో తన సమావేశాన్ని ప్రకటించిన పొప్ ఫ్రాన్సిస్ గారు


 6 నవంబర్ 2023 మధ్యాహ్నం "అబ్బాయిలు మరియు అమ్మాయిల నుండి నేర్చుకుందాం" అనే థీమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలతో సమావేశమవుతారని పొప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించారు.
ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు  ఎదురుగా ఉన్న తన బాల్కనీలో నుండి ఈ ప్రకటన పొప్ ఫ్రాన్సిస్ గారు చేసారు.  

ఈ కార్యక్రమాన్ని డికాస్టరీ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రచారం చేసి నిర్వహిస్తుందని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు. ఇది "స్వచ్ఛమైన, పిల్లల భావాలను గౌరవిస్తూ, దేవుని పట్ల వారి  ఆలోచనలు తెలియజేస్తుందని , ఎందుకంటే  చిన్నపిల్లలదే  దేవుని రాజ్యం అని ఆయన వివరించారు.ప్రియమైన పిల్లలారా,  మీ నుండి మేమందరము నేర్చుకోవాలని,  నేను కూడా ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాను, అని ఈ సందర్భముగా పొప్ ఫ్రాన్సిస్ గారు  అన్నారు.