35. ప్రజలు అచట నిలుచుండి ఇది అంత చూచు చుండిరి. "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుని వలన ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము" అని అధికారులు కూడ ఆయనను హేళనచేసిరి.