వృదులను మరియు రోగగ్రస్తులను కలిసిన పోప్ లియో

బుధవారం డిసెంబర్ 17 సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే సాధారణ ప్రేక్షకుల సమావేశానికి ముందు ఆరవ పాల్ హాల్‌లో వివిధ అనారోగ్యాలు మరియు వైకల్యాలు ఉన్న వ్యక్తులను పోప్ లియో కలిశారు.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌ ప్రాంగణంలో సాధారణ సమావేశంలో పోప్‌కు దగ్గరగా ఉన్న ఒక విభాగాన్ని అనారోగ్యంతో ఉన్నవారి కోసం కేటాయిస్తారు, అయితే ఈ వారం ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున వారితో వ్యక్తిగతమైన సమావేశం” ఏర్పాటు చేసినట్లు పోప్ వివరించారు.

“మేము మిమ్మల్ని వాతావరణ ప్రభావాల నుండి, ముఖ్యంగా చలి రక్షించాలనుకున్నాము,” అని పోప్ లియో వారితో అన్నారు.

పోప్ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకొని వారిని పలకరించాలని, ఆశీర్వదించాలని మరియు పండుగలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయాలని తాను కోరుకుంటున్నట్లు పోప్ చెప్పారు. 

క్రీస్తు జయంతి ఆనందం మీకు, మీ కుటుంబాలకు మరియు మీ ప్రియమైనవారికి తోడుగా ఉండాలి” అని ప్రభువును ప్రార్దిదాం అని పోప్ అన్నారు