కాంగోలో హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిన పోప్ లియో

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ తూర్పు ప్రాంతంలో తిరిగి జరుగుతున్న పోరాటంపై పోప్ లియో  ఆందోళన వ్యక్తం చేశారు.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో డిసెంబర్ 14 ఆదివారం త్రికాల ప్రార్ధన ముగింపులో మాట్లాడుతూ, పోప్ ప్రజలకు తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు.

హింసను నిలిపివేయాలని మరియు కొనసాగుతున్న శాంతి ప్రక్రియను గౌరవిస్తూ నిర్మాణాత్మక సంభాషణను ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

తూర్పు కాంగోలోని వ్యూహాత్మక నగరమైన ఉవిరాలో, ప్రాంతీయ అధికారులు ప్రాణాంతక దాడిని నివేదించారు, దీని వలన 400 మందికి పైగా మరణించారు మరియు మరో 200,000 మంది నిరాశ్రయులయ్యారు.

యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం వహించిన ఇటీవలి శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ ఈ దాడి జరిగింది.