ప్రభు యేసుని ప్రేమని చాటుతున్న సెబాస్టియన్ చాపెల్ యువత

సెబాస్టియన్ చాపెల్ యువత

ప్రభు యేసుని  ప్రేమని చాటుతున్న సెబాస్టియన్ చాపెల్ యువత

సికింద్రాబాద్ లోని అమృతవాణి దగ్గరలో ఉన్న పునీత సెబాస్టియన్ చాపెల్ దగ్గర శ్రీ రోనాల్డ్ సోలమన్ గారి ఆధ్వర్యంలో పేదవారికి ఆహారాన్ని అందించారు.   

పునీత సెబాస్టియన్ గారి పేరు మీద ఈ కార్యక్రమం జరిగింది. రోనాల్డ్ సోలమన్  గారు ప్రతి నెల ఇదే విధంగా పేదవారికి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. సెబాస్టియన్ రోడ్ లో మరియు పునీత సెబాస్టియన్ చాపెల్  చుట్టుపక్కల ఉన్న పేదవారికి ,అవసరంలో ఉన్న వారికీ స్థానిక యువతతో కలసి రోనాల్డ్ సోలమన్ గారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

పునీత మేరీస్ బలిసికా నుండి గురుశ్రీ విల్ఫ్రెడ్ గారు ఈ కార్యక్రంలో  పాల్గొని పేదవారికొరకు ప్రత్యేకంగా ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగత్ గారు, రెయూబెన్ రాజ్,జస్ట్ ,రాజకుమార్, ఐర్ధిరాజు, డ్ సైరస్ మొదలగువారు పాల్గొన్నారు.         

Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer