పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్‌కు పోప్ లియో సందేశం

కృత్రిమ మేధస్సుపై నిర్వహించిన పొంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్‌ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించిన పోప్ లియో , ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మానవ వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు

కృత్రిమ మేధస్సు భవిష్యత్తు ముందే నిర్ణయించబడలేదు. మానవులు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంగా, దాని భవిష్యత్తు మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. 

అందువల్ల, దాని వినియోగాలను సరైన దిశలో నడిపించడం, అవసరమైన మార్పులు చేయడం, అవసరమైతే కొన్ని వినియోగాలను పూర్తిగా తిరస్కరించడం మన బాధ్యత.

యంత్రాలు కేవలం సాధనాలు మాత్రమే, వ్యక్తులు కావు. కృత్రిమ మేధస్సు వ్యవస్థలు అనుభవాలను పొందలేవు. వాటికి భౌతిక శరీరం ఉండదు. ఆనందాన్ని లేదా బాధను అనుభవించలేవు.  ప్రేమ, శ్రమ, స్నేహం, బాధ్యత వంటి వాటి అసలైన అర్థాన్ని అంతర్గతంగా తెలుసుకోలేవు.

కొన్ని నిర్ణయాలను ఎన్నటికీ యంత్రాలకు అప్పగించకూడదు. ఒక వ్యక్తిని లక్ష్యంగా గుర్తించే జాబితాలో చేర్చినప్పుడు లేదా సరిహద్దు నియంత్రణ సమాచార వ్యవస్థలో నమోదు చేసినప్పుడు, ఆ వ్యక్తిని కేవలం ఒక సమాచార అంశంగా మాత్రమే పరిగణించే ప్రమాదం ఉంది.

మానవ జీవితం, స్వేచ్ఛ, బలప్రయోగం వంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సమగ్రమైన అవగాహన కలిగిన, బాధ్యతాయుతమైన మానవ పర్యవేక్షణలోనే ఉండాలి.

ఈ కారణంగానే, కృత్రిమ మేధస్సును నిరాయుధీకరించాలి. నవంబర్ నెలలో జెనీవాలో సమావేశమవుతున్న దేశాలు, ప్రాణాంతక స్వయంప్రతిపత్తి ఆయుధాల నిషేధం దిశగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను.
 

Telugu Survey Popup Image