ఘనంగా TCBC ప్రాంతీయ యువత నాయకుల శిక్షణ కార్యక్రమము

ఘనంగా TCBC ప్రాంతీయ యువత నాయకుల శిక్షణ కార్యక్రమము

 

శ్రీకాకుళం మేత్రాసనంలో యువతీ యువకులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం ను టీసీబీసీ యువత విభాగం వారు నిర్వహించారు.సెప్టెంబర్ 20-21 తేదీలలో ఈ కార్యక్రమ ఘనంగా జరిగింది.TCBC ప్రాంతీయ యువత విభాగ అధ్యక్షులు, శ్రీకాకుళ మేత్రానులు మహా పూజ్య రాయరాల విజయకుమార్ తండ్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం ఘనంగా జరిగింది.

 

మరియగిరి పుణ్యక్షేత్రం లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ మేత్రాసనలనుండి పలువురు యువత డైరెక్టర్ గురువులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. గురుశ్రీ చేతన్ మచాడో, CCBI యూత్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గార్లు పాల్గొని తమ విలువైన సూచనలను యువతకి ఇచ్చారు.

మేత్రాసన ఆధ్యాత్మిక ప్రసంగీకులు, మరియగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ చల్ల డేవిడ్ గారు మాట్లాడుతూ "యవ్వన కాలమందు యువత దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలని, పాపంలో పడకుండా మెలుకువగా ఉండాలని, ఎక్కువ సమయం దేవునితో ప్రార్థనలో గడపాలని సూచించారు.

 

యువత డైరెక్టర్ ఫాదర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ గారు యువతను ప్రభుయేసుని మార్గం లో నడవాలని కోరారు. గురుశ్రీ అర్జీ ప్రకాష్ గారు యువత ఏవిధముగా సమయాన్ని ఉపయోగించాలి ? యువత ఏవిధముగా సమస్యలను ఎదురించి ముందుకు వెళ్ళాలి? జీవితం లో ఎలా విజయం సాదించాలి అనే అంశాలపై మాట్లాడారు.

అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుశ్రీ ప్రేమ్ కుమార్, గురుశ్రీ విజయ్ చందూర్, గురుశ్రీ స్లీవరాజ్ , గురుశ్రీ జస్టిన్, గురుశ్రీ వేలాంగని, గురుశ్రీ జేమ్స్, గురుశ్రీ ఉపేంద్ర, సిస్టర్ ప్రమీల మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువత విభాగం నుండి ఫాతిమా మాట్లాడుతూ " యువత దేవుని మాట ప్రకారం జీవించాలని, ప్రతి రోజు బైబిల్ పఠనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారని అన్నారు".

ఈ రెండు రోజులు స్తుతి ప్రార్థనలు, దివ్యాసప్రసాద ఆరాధన మరియు దివ్య బలిపూజలలో యువతీ యువకులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు