వార్తలు

  • క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు

    Apr 23, 2024
    క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు

    భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ డిమాండ్‌ను నొక్కిచెప్పేందుకు జరుగుతున్న జాతీయ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాకరించారు.
  • హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ స్వర్ణ జూబిలీ వేడుక

    Apr 23, 2024
    ఏప్రిల్ 19,2024న బంగ్లాదేశ్, ఢాకా, బనానీలో హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ 50వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

    "స్థానిక శ్రీసభ నిర్మించడంలో 50 ఏళ్ళ కీర్తి." అనే నేపథ్యంపై జూబ్లీ వేడుక జరిగింది.

    బంగ్లాదేశ్‌లోని పాపు గారి రాయబారి మహా పూజ్య కెవిన్ రాండాల్ గారు, 8 మంది ఇతర పీఠాధిపతులు,250 మంది గురువులు, 600 మందికి పైగా కథోలిక విశ్వాసులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బెజోయ్ యెన్ డి' క్రూజ్ OMI గారు గౌరవ అతిథిగా ఈ వేడుకను అలంకరించగా,బారిసాల్‌ పీఠాధిపతులు,ఎపిస్కోపల్ కమీషన్ అధ్యక్షులు మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు దివ్యబలి పూజను సమర్పించారు.

    "హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ బంగ్లాదేశ్ కు దైవిక బహుమతి"అని కార్డినల్ పాట్రిక్ డి'రొజారియో గారు కొనియాడారు.

    హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ ఆగష్టు 23, 1973న స్థాపించబడింది మరియు మహా పూజ్య ఎడ్వర్డ్ కాసిడీ గారిచే లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది.

    ఐదు దశాబ్దాలుగా ఈ గురువిద్యాలయం 987 మంది విద్యార్థులకు విద్యను అందించింది, 9 మంది పీఠాధిపతులతో సహా 445 మంది గురువులను నియమించింది మరియు 83 మంది బ్రదర్ లను , 11 మంది మఠకన్యలను మరియు సామాన్యులకు తన విశిష్ట కార్యక్రమాల ద్వారా సేవనందించింది.మొత్తం 103 మంది ఉపాధ్యాయులు ఈ ప్రయత్నానికి ప్రత్యక్షంగా సహకరించారు.
  • మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

    Apr 19, 2024
    మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత

    ఆదిలాబాద్ మేత్రాసనం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా హనుమాన్ మాల ధరించి కొంతమంది విద్యార్థుల స్కూల్ కి వచ్చారు. ప్రిన్సిపాల్ దీనిని ప్రశ్నించడంతో వివాదం చోటుచేసుకుంది. స్కూల్‌ లోపల హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.
  • ఘనంగా అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం

    Apr 18, 2024
    ఘనంగా అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం


    అమృతవాణి స్వర్ణ జూబిలీ ఆత్మీయ సమ్మేళనం (Golden Jubilee Reunion ) ఘనంగా జరిగింది. ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి, అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • మిడిల్ ఈస్ట్‌లో హింసాకాండను అరికట్టాలి : ఫ్రాన్సీస్ జగద్గురువులు

    Apr 15, 2024
    మిడిల్ ఈస్ట్‌లో హింసాకాండను అరికట్టాలి : ఫ్రాన్సీస్ జగద్గురువులు

    ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న హమాస్ చేసిన భీకర దాడులు, వీటికి ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రపంచం విలవిలలాడుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా . ఈ ఆరు నెలల యుద్ధం కారణంగా రోగాలు, పస్తులు, చావులతో గాజాలోని పాలస్తీనియన్ల జీవితం ధ్వంసమైంది.
  • పంచగాయాలను తద్దిభా అను యువతి పొందుకున్నారు.

    Apr 13, 2024
    కడప మేత్రాసనం లోని రామాపురంలోని పునీత పాద్రేపియో దేవాలయంలో పంచగాయాలను తద్దిభా అను యువతి పొందుకున్నారు.
    MMG మఠ సంస్థలో మఠకన్యగా మారటానికి శిక్షణ తర్ఫీదు తీసుకోవడానికి ఒరిస్సా నుండి తద్దిభా అనే యువతి వచ్చింది
  • ప్రార్థన సమావేశానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది

    Apr 12, 2024
    ప్రార్థన సమావేశానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది

    చెన్నై నగరంలో ఉన్న డా.పాల్ దినకరన్ గారు, దేశవ్యాప్తంగా ప్రార్ధన సమావేశాలను నిర్వహించే ప్రసిద్ధ సువార్తికులు.
  • ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం

    Apr 12, 2024
    ఘనంగా ఖమ్మం కతోలిక పీఠకాపరి అభిషేక మరియు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం

    ఖమ్మం కతోలిక పీఠకాపరి గా మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు పదవీ బాధ్యతల స్వీకరించారు.
    శ్రీ సభ పాలకులు మహా పూజ్య ఫ్రాన్సిస్ పోపు గారు కడప పీఠానికి చెందిన పూజ్య మోన్సిగ్నోర్ సగిలి ప్రకాష్ గారిని ఖమ్మం మేత్రాసన నూతన పీఠాధిపతి గా నియమించియున్నారు.
  • ఘనంగా జరిగిన మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం

    Apr 11, 2024
    ఖమ్మం మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా నియమితులైన మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం
  • సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ అవశేషాల ప్రదర్శనకు సిద్ధం కావాలి : కార్డినల్ ఫిలిప్ నెరి గారు

    Apr 10, 2024
    సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ అవశేషాల ప్రదర్శనకు సిద్ధం కావాలి : కార్డినల్ ఫిలిప్ నెరి గారు

    సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ (పునీత ఫ్రాన్సిస్ శౌరీవారు) అవశేషాల ప్రదర్శన కోసం గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఫెర్రో గారు అవశేషాల ప్రదర్శనకు మరియు ఆధ్యాత్మిక సన్నాహాలను ప్రారంభించాల్సిందిగా కోరారు.
  • బైబిల్ కోర్సుల ద్వారా విశ్వాసులను బలపరుస్తున్న DCBA

    Apr 08, 2024
    బైబిల్ కోర్సుల ద్వారా విశ్వాసులను బలపరుస్తున్న DCBA

    గోవా మరియు డామన్‌ అగ్రపీఠంలోని "డియోసెసన్ సెంటర్ ఫర్ బైబిల్ అపోస్టోలేట్" (DCBA) పాస్టోరల్ ఇయర్ 2023-2024లో బైబిల్ కోర్సులలో పాల్గొన్న 769 మంది విజయవంతంగా బైబిల్ కోర్సులను పూర్తి చేసారు.
  • అశ్రునివాళి

    Apr 06, 2024
    గురుశ్రీ మార్టిన్ బోస్కో క్యూస్షన్ C.S.S.R. REDEMPTORISTS.

    గురువు యొక్క జీవితం🌹
    1)# 89 సంవత్సరాల 10 నెలలు మూడో రోజుల 60 నిమిషాల క్రితం అనగా విన్సెంట్ క్యూస్షన్ పుణ్య దంపతులకు జన్మించిన నార్త్ ఐర్లాండ్ దేశం ముద్దుబిడ్డ Fగురుశ్రీ మార్టిన్ నీకు ఇవే భారతదేశ అశ్రునివాళి

    ( 2)🍁 #65 సంవత్సరాల 10 నెలల మూడు రోజుల 60 నిమిషాల క్రితం దేవుని సేవ కొరకు అంకిత మునుర్చుకున్న యాజక భాగ్యం పొందిన శుభ ఘడియలు గురుశ్రీ మార్టిన్

    (3) # 69 సంవత్సరాల యాజక గురుత్వ సుదీర్ఘ ప్రయాణం ఈ భారత దేశంలో మీ ప్రయాణం ఎన్నో దివ్యపూజలకు దివ్య సంస్కారాలకు నాంది పలుకగా ఎంతోమంది పేద విద్యార్థుల గుండెల్లో అక్షరాభ్యసత పునాదివేసి ఎంతోమందికి అపురూపమైన గృహాలను నిర్మించిన అనారోగ్యంలో ఉన్న ఎంతోమందికి ఆరోగ్య ప్రదాతవై భారతదేశానికి వన్నెతెచ్చావు పేదల పాలిట అభాగ్యుల పాలిట దిక్కులేని వారి యెడల ఆత్మబంధువై అపర క్రీస్తు స్థానంలో ఉండి సేవ చేసిన సేవా తత్వ సత్పురుషుడు గురుశ్రీ మార్టిన్

    (4) రక్షక సభలో అఖండ జ్యోతిల వెలిగిన నీ గురి జీవితం రక్షక సభకు వెలుగు మార్గ చూపురి అయినావు ఎందరో గురువులకు ఆదర్శనీయమై ఎందరో గురువులను తయారు చేసిన నీ జీవితం ప్రయాణంలో చివరి అంతము వరకు చేసిన సేవ రక్షక సభకి ఒక వరం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్యారిస్ గా పిలవబడే గుంటూరు జిల్లా తెనాలి పట్టణం నందు చెంచుపేటలో వెలసినటువంటి నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం నందు విచారణ గురువుగా సేవలు అందించి చివరి అంతం వరకు తెనాలి విచారణ కొరకే పాటుబడిన ఓ మహర్షి గురుశ్రీ మార్టిన్

    (5) విశ్రాంతి దినం అనగా ఆదివారం రోజున జన్మించిన నీవు 💒 మరియమాత పూజిత మాసంలో మరి తల్లికి అంకితం చేయబడిన శనివారం రోజున గురిపట్టాభిషేకం పొందిన నీవు మంచి మరణం కోసం ప్రార్థన చేసుకునే పునీత జోజప్ప గారికి అంకితం చేయబడిన బుధవారం రోజునే మీరు మంచి మరణం పొందారు గురుశ్రీ మార్టిన్ నీకు ఇవే మా అంతిమ వీడ్కోలు సదా నీ ఆత్మ దేవుని రాజ్యంలో ప్రకాశించును గాక, నీ పవిత్ర ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగును గాక !


    By Anudeep Ande
    Redemptorists Priests from the Province of Bangalore
  • ఫిలిప్పీన్స్ లో మరియతల్లి పై తొలి సదస్సు

    Apr 06, 2024
    మే 1న, ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ సిటీ, క్లారెట్ స్కూల్‌లో మరియతల్లి పై తొలి సదస్సు జరగనుంది

    "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు" (లూకా 1:42) అనే నేపథ్యంపై ఈ సదస్సు జరగనుంది

    ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

    ఫిలిప్పీన్స్‌లో మరియతల్లిపై ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు క్లారెషియన్ కమ్యూనికేషన్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ డెన్నిస్ తమయో తెలిపారు.

    "మరియతల్లితో మా ప్రయాణం ముగియలేదు. యుగాలుగా, ఆ తల్లి మాకు తోడుగా ఉంది, మమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపించింది" అని గురుశ్రీ తమయో అన్నారు.
  • వాటికన్ సినడ్ సమావేశంలో పాల్గోనున్న ముగ్గురు ఫిలిపినో గురువులు.

    Apr 05, 2024
    ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు వాటికన్‌లో జరిగే ప్రపంచవ్యాప్త విచారణ గురువుల సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ఫిలిపినో గురువులు ఎంపికయ్యారు.

    1 .మొన్సిగ్నోర్ జోయెల్ బ్రూనో బారుట్, వికార్ జనరల్-లావోగ్ మేత్రాసనం,
    టీమ్ మినిస్ట్రీ మోడరేటర్, లావోగ్ సిటీలోని సెయింట్ విలియం ది హెర్మిట్ కేథడ్రల్

    2 .మొన్సిగ్నోర్ మార్నిటో బన్సిగ్, ఎపిస్కోపల్ వికార్, మాసిన్ మేత్రాసనం,వికార్ ఫోరేన్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ వికారియేట్,విచారణ గురువులు, బాటో, లేటేలోని హోలీ చైల్డ్ విచారణ
    3 .మొన్సిగ్నోర్ జూలియస్ రోడుల్ఫా,వికార్ జనరల్, ఎపిస్కోపల్ వికార్ మరియు దావో అగ్రపీఠ పాస్టరల్ డైరెక్టర్,దవావో నగరంలోని శాన్ పెడ్రో కేథడ్రల్ విచారణ, పార్శియల్ వికార్ లు ఎన్నికయ్యారని ఫిలిప్పీన్స్‌లోని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) సెక్రటరీ-జనరల్
    మొన్సిగ్నోర్ బెర్నార్డో పాంటిన్వా గారు తెలిపారు

    ఫిలిప్పీన్ ప్రతినిధి బృందం కోసం దేశంలోని ప్రధాన దీవుల్లోని లుజోన్, విసయాస్ మరియు మిండనావో నుండి ఒక గురువుని ఎంపిక చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు పాంటిన్ తెలిపారు.

    విచారణ గురువుల సినడ్ సమావేశాలు ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు రోమ్ సమీపంలోని సాక్రోఫానోలోని ఫ్రటెర్నా డోమస్‌లో జరుగుతుంది, దాదాపు 300 మంది హాజరయ్యే అవకాశం ఉంది.

    సమావేశం యొక్క చివరి రోజున, పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనేవారితో వ్యక్తిగతంగా సమావేశమవుతారు.

    ఈ ప్రపంచవ్యాప్త సమావేశం యొక్క ఫలితాలు ఈ అక్టోబర్‌లో జరిగే సినడల్ అసెంబ్లీ రెండవ సెషన్‌కు సంబంధించిన వర్కింగ్ డాక్యుమెంట్ అయిన ఇన్‌స్ట్రుమెంటమ్ లాబోరిస్‌ను రూపొందించడానికి ఉపయోగించబడతాయి.
  • యేసు తిరుహృదయ దేవాలయంలో మ్రానికొమ్మల ఆదివారం

    Mar 26, 2024
    మానవ రక్షణ చరిత్రలో మ్రానికొమ్మల ఆదివారం ముఖ్య ఘట్టమని హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగుడ, యేసు తిరుహృదయ దేవాలయం నందు మార్చి 24 2024, ఉదయం 8 గంటలకు  గురుశ్రీ  కుందూరు జోజి గారు మరియు విచారణ సహాయక  గురువు  గురుశ్రీ ప్రభాకర్ గారు   మ్రానికొమ్మలను ఆశీర్వదించి విశ్వాసులకు అందజేశారు. 
  • భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం | Srikakulam |

    Mar 26, 2024
    శ్రీకాకుళం మేత్రాసనంలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది.

    శ్రీకాకుళం మేత్రాణులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది.
  • భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

    Mar 26, 2024
    భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

    విశాఖ అతిమేత్రాసనం క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, క్రీస్తురాజుపురం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది.